Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మిస్టరీ ఆఫ్ గురుద్వార్..
మన భారతదేశం ఆలయాలకి పెట్టింది పేరు.ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక దేవాలయాలు మరియు పురాతన కాలంలో కథలు ఉంటాయి..మనం నిత్య జీవితంలో దేవుడు చేసే చాలా అద్భుతలు స్వయంగా వీక్షించి లేదా విని ఉంటాయి. అయితే కొన్ని అద్భుతాలు మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అయితే అలాంటి ఒక దేవాలయం గురించి దాని వెనుక వున్న కథ గురించి తెలుసుకుందాం..
మామిడి పండు అంటే అందరికీ ఇష్టమే కదా .సర్వసాధారణంగా మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయా.? లేదుఎండాకాలంలో మాత్రమే దొరుకుతయీ కదా.. అయితే మీరు కాలంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ మామిడికాయలు ఇచ్చే చెట్టు చూపించగలరా..?కష్టం అని అనుకుంటున్నారా..? కానీ అలాంటి మామిడి చెట్టు గురుద్వార్ లో నిజంగానే ఉంది..
ఇది నిజమే..నమ్మరా.. అయితే సరే ఈ చెట్టు ఎక్కడ ఉందొ ..ఆ ఆలయ విశేషాలేంటో..పూర్తి కథ చదివి తెలుసుకోండి…
పంజాబ్ లోని మొహాలీలో గురుద్వార్ అనే సిక్కుల మతానికి చెందిన పవిత్ర ఆలయం ఉంది..గురుద్వార్ అంటే “గురు కి తలుపు” అని వారి భాషల్లో అర్ధమట. ఈ గురుద్వార్ అంబ్ సాహిబ్ కి ఎంతో చారిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది సిక్కుల ఏడవ గురు అయిన గురు హర్ రాయ్ చేత సందర్శించి బడినదని వారి నమ్మకం.
ఈ ప్రదేశానికి అంబ్ సాహిబ్ అని అనడానికి గల కారణం కూడా ఉంది. అంబ్ అంటే పంజాబీలో మామిడి అని అర్థం.
పురాణాల ప్రకారం భాయ్ కూర్మా సింగ్ అనే వ్యక్తి కాబుల్ నుంచి అమ్రిత్సర్ కి తన
గురువు ఆయన అర్జున్ దేవ్ జీ ని కలవడానికి వెళ్ళాడు.అక్కడికి వచ్చే భక్తులందరూ గురువుకి తాము తెచ్చిన ప్రసాదాలను సమర్పించుకోవడం చూసాడు. తన వెంట గురువుకి సమర్పించుకోవడానికి ఎటువంటి ప్రసాదం తీసుకొని రాలేదు. ప్రార్థనలు, కీర్తనలు ముగించుకున్న తరువాత అక్కడి భక్తులందరికీ మామిడిపళ్ళను ప్రసాదంగా ఇచ్చారు. భాయ్ కూడా ప్రసాదంగా ఇచ్చిన మామిడి పండ్లు స్వీకరించాడు కానీ దాన్ని తినకుండా దాచుకున్నాడు. మర్నాడు అదే మామిడి పండ్లును గురువుకి ప్రసాదంగా సమర్పించాడు.
ఇదంతా తెలిసిన గురువు ఇంకెప్పుడైనా స్వీకరిస్తానని అంటూ ఆ మామిడి పండు తినమని భాయ్ కి చెప్పారు
కొంతకాలం తర్వాత గురు అర్జున్ దేవ్ జీ కుమారుడైన గురు హర రాయ్ జీ తన తండ్రి వాగ్దానం కోసం ఆలయం సందర్శించారు. అక్కడ తోటలో ధ్యానంలో ఉన్న భాయ్ ని చూసి అతను గురువుకు ఇచ్చిన వాగ్దానాన్ని తీర్చమని అడిగాడు. కానీ అది మామిడిపళ్ళు సీజన్ కాకపోవడంతో తన దగ్గర మామిడిపళ్లు లేవు అని సమాధానమిచ్చాడు. ఇదంతా విన్న అర్జున్ దేవ్ జీ తన అద్భుతమైన శక్తితో తోటలోని ఒక మామిడి చెట్టు నిండా మామిడికాయలను పూయించారు..భాయ్ ఈ వింతను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత మామిడి చెట్టు నుంచి మామిడి కాయలు కోసి గురువుకి సమర్పించుకున్నాడు. అప్పటి నుండి గురుద్వార్ లో, ప్రతి సీజన్లో పండును కలిగి ఉన్న మామిడి చెట్టు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం జనవరిలో అక్కడికి వచ్చే భక్తులకు ఆ మామిడికాయలు ప్రసాదాలుగా అందిస్తారు. ఇప్పటికీ భాయ్ కుర్మా సింగ్ జ్ఞాపకార్థం పవిత్ర స్థలం చూడవచ్చు. అది ధ్యాన మందిరంగా అక్కడి వారందరూ నిత్యం కొలుస్తారు.
ఇది గురుద్వార్ లో లోని మామిడిచెట్టుకి నిత్యం మామిడికాయలు పూయడం గల అసలు కారణం..
పంజాబ్ లోని మరికొన్ని గురుద్వార్ లాగా కొలవబడేవి..ఖాదిర్ సాహిబ్, బాబా బాకాలు, డేరా బాబా నానక్ గురుద్వారా బేర్ సాహిబ్. గురు క లాహోర్ .. వంటి. ఎన్నో గురుద్వార్ లు అక్కడ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. గురుద్వార్ కి ప్రవేశించడనికి నాలుగు ద్వారాలు ఉంటాయి, అవి డోర్ అఫ్ పీస్, ది డోర్ అఫ్ లైవ్లీహూడ్, ది డోర్ అఫ్ లెర్నింగ్, ది డోర్ అఫ్ గ్రేస్ గా పిలవబడుతున్నాయి. ఈ తలుపులు దిక్సూచిగా నాలుగు దిక్కుల నుండి ప్రజలు స్వాగతించబడుతున్నారని చిహ్నం. అలాగే నాలుగు కులాల సభ్యులు సమానంగా స్వాగతం పలుకుతున్నారు. గురుద్వార్ శిఖరం పైన ఒక నారింజ రంగు జండా కనిపిస్తూ ఉంటుంది, అది సిక్కులకి ఒక చిహ్నం. సిక్కులకు సాధారణ ప్రార్ధనలో ప్రత్యేక వేడుకలు నిర్వహించడమే కాకుండా..కీర్తన్, సెర్మోన్, ఆర్డర్స్ ,హుకం వంటివి వారి పార్దనలో ఒక భాగం.
చాలామంది సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ ను గౌరవించే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. గురుద్వార్ లో విగ్రహాలు లేవు, మతపరమైన చిత్రాలు లేవు, ఎందుకంటే సిక్కులు మాత్రమే దేవుణ్ణి పూజించేవారు, వారికీ భౌతిక రూపాన్ని కలిగి ఉండరు అని నమ్ముతారు. ప్రధాన హాల్ లో గౌరవ దృష్టి, గురు గ్రంథ్ సాహిబ్ పుస్తకం, మానవ గురువుకి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు.
గురుద్వార్ లోకి ప్రవేశించే వారు పాటించవలసిన నియమాలు:
లోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరి తలపై ఒక గుడ్డ కప్పి ఉండాలి.
మీ బూట్లు, సాక్సులు తీసి లోనికి ప్రవేశించాలి.
మీరు ప్రవేశించే ముందు మీ చేతులు, కాళ్ళ శుభ్రం చేసుకోవాలి.
గురుద్వార్ లో కుర్చీలు లాంటివి ఏమీ ఉండవు , కాబట్టి కింద కూర్చుని భగవంతుని ధ్యానించి కొలవాలి.
ఈ గురుద్వార్ లో స్త్రీలు ఎడమవైపున పురుషులు కుడివైపు కూర్చొని ఉండటం ఆచారం.
కథ , కీర్తన్ శ్రద్ధగా విని ఆచరించాలి.
దేశవ్యాప్తంగా 50 కి పైగా సిక్కు దేవాలయాలు ఉన్నపటికీ గురుద్వార్ వీరికి పుణ్యస్థలము. ఇదే కాకుండా పంజాబ్ రాష్ట్రం చుట్టుపక్కల వేలాది సిక్కుల ఆలయాలు ఉన్నాయి.
ప్రతి సంవత్సరం ఈద్ జరుపుకునే ప్రజలు గురుద్వార్ వద్ద ప్రార్ధనలు చేస్తారు.
ఈ గురుద్వారాకుఎలా వెళ్ళాలి?
రోడ్డు ద్వారా
ఢిల్లీ, చండీగఢ్, అంబాలా వంటి సమీప ప్రాంతాల నుండి మొహాలికి వెళ్ళటానికి రోడ్డు రవాణా ఉత్తమ మార్గం. మొహలి చేరుకోవటానికి ఆటోస్ ,టాక్సీలు కూడా లభిస్తాయి.
రైలు ద్వారా
మొహాలికి రైలు సదుపాయం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా పర్యాటకులు చండీగఢ్ రైల్వే స్టేషన్కి రైలు పట్టవచ్చు.
విమానం ద్వారా
మొహాలిలో విమానాశ్రయం లేనప్పటికీ చండీగఢ్ విమానాశ్రయం ద్వారా తూర్పున 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరానికి సులభంగా చేరుకోవచ్చు.