!!పూరి జగన్నాధ్ విశేషం !

puri jagannath temple history and Highlights

!!పూరి జగన్నాధ్ విశేషం !

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హాయ్ ఫ్రండ్స్ ఇప్పటివరకు ఎన్నో గుడుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పూరి లో ఉన్న జగన్నాథ దేవుడి గురించి తెలుసుకుందాము.   ఇది భారత దేశం లో ని ఒడిస్సా రాష్ట్రం లో పూరి పట్టణంలోకొలువై ఉన్నది.

జగన్నాధుడు, లోకం ఏలేవాడు…. ఇక్కడ ప్రతీది మిస్టరీ గానే ఉంటుంది ..అవేంటో చూద్దామా మరి …….

ముందుగా పిరమిడ్ గురించి తెలుసుందాం …గణ గణ మోగే బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతమైన ఆలయం లో చెక్కిన నిర్మాణాలలో కృషుడి జీవిత విశేషాలు చెక్కబడి ఉన్నాయి ..చిన్ని కృష్ణుడి జీవితాన్ని స్థంబాల పై అద్భుతం గా చెక్కారు ..జగన్నాధ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు దర్శిస్తారు …జగన్నాధ రధ యాత్ర్హ ప్రసిద్ధమైనది ..ఒడిస్సా రాష్ట్రము లో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని 1077 వ సంవత్సరం లో నిర్మించారు ..అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాలలో ఉన్నట్లేగోపురాలు, గుడి గంటలు ఉన్నా, వేటికవే ప్రత్యేకం …

మొదట గా చెప్పుకోవాల్సి న అంశం గోపురం పైన ఎగిరే జెండా..ఈ ఆలయ గోపురానికి కట్టిన జెండా చాలా ఆశ్చర్యం గా ఉంటుంది.  సాధారణం గా ఏ గుడి కైనా కట్టిన జెండా గాలి ఎటు వైపు వీస్తుందో అటు వైపు మాత్రమే ఎగురుతుంది కానీ ఇక్కడ మాత్రం బిన్నం గా గాలి వీచే దిక్కున కాకుండా వ్యతిరేక దిశా లో జెండా రెప రెపలాడుతుంది .ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఎవరు కనిపెట్టలేకపోయారు ..అద్భుతమైన నిర్మాణ కౌశల్యానికి ఇది ఒక  మచ్చు తునక.

మరొక విచిత్రం చక్రం .. గోపురం పైన వుండే ఈ సుదర్శన చక్రం పరమ పవిత్రం ..మీరు పూరి పట్టణం లో ఎక్కడ నుంచి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం మీ వైపు తిరిగినట్టు , మీ వైపు నే చూస్తునట్లుకనిపిస్తుంది ఇదొక అద్భుతం ..ఇలా ఎలా నిర్మాణం చేశారో ఇప్పటికి ఎవరు చెప్పలేకపోయారు ..పూరి లో ఎక్కడ నిలబడి చూసినా కూడా ఆ సుదర్శన చక్రం మీ వైపు కె చూస్తూ ఉండటం ప్రత్యేకమే కదా..puri jagannath temple history and Highlights

ఇక సముద్రం నుంచి వచ్చే అలలు.  సాధారణం గా సముద్రం లో ని అలలు పగటి పూట గాలి సముద్రం పై నుంచి భూమి వైపు కి తిరిగి ఉంటుంది …సాయంత్రం వైపు గాలి భూమి నుంచి సముద్రం వైపు కు వీస్తుంది కానీ పూరి లో అలా కాకుండా వ్యతిరేక దిశ లో వీస్తూ ఉంటుంది ఇదొక ప్రత్యేకత ..అని చెప్పుకోవచ్చు …

ఇక ఏ ఆలయం లో నైనా ఏవైనా పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా..కానీ అదేంటో ఈ పూరి లో ఎక్కడ కూడా పక్షులుగుడి చుట్టుపక్కల కనిపించవు అంట…ఎందుకు అలా అంటే ప్రత్యేకమైన కారణమేమి చెప్పలేకపోతున్నారు …ఇక ఎలాంటి పక్షులు ఈ ఆలయం పై నుంచి ఎగరవు …అలా ఎందుకో ఇప్పటికి అంతు చిక్కదు ..అదే కాదండి ..ఎలాంటి విమానాలు, హెలికాప్టర్ లు కూడా ఆలయం నుంచి ఎగరావు అట…ఇదొక నిమయం అయి కూడా ఉండవచ్చు …

ఇంకొక అద్భుతం గోపురం నీడ….పూరి జగన్నాధ్ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఏ మాత్రం కనిపించదు ..అది పగలు అయినా, సాయంత్రమైన అసలు కనిపించదు ..రోజులో ఏ సమయం లో అయినా గోపురం నీడ మాత్రం కనిపించదు.  ఇది దేవుడి గొప్పదనమో,  మరి నిర్మాణ లోని కౌశల్యమో తెలియదు కానీ ఇప్పటికి ఇదొక వింతనే…

ఇక జగన్నాధ్ ఆలయం లో దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని “మహా ప్రసాదం ” గా పిలుస్తారు దాదాపు రోజుకి 56 రకాల పిండివంటలని …దేవుడి కి నైవేద్యం గా పెడతారు ఈ ప్రసాదాన్ని ఎవరు కూడా వృధా చెయ్యరు ….ఇంకా ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్లి తమ బందు మిత్రులకి పంచి పెడతారు కూడా…ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ ప్రసాదాల్ని కేవలం కుండలలో నే తయారు చేయడం …ఎలాంటి ఇత్తడి గాని, ఇనుము కానీ మారె ఇతర లోహ పాత్రలని ఉపయోగించక పోవడం.puri jagannath temple history and Highlights

సముద్ర అలల శబ్దం ఇంకొక అద్భుతం .  దేవుడి గుడి సింహ ద్వారం గుండా ఆలయం లోకి ప్రవేశిస్తూ ఒక్క అడుగు లోపలకి పెట్టగానే సముద్రపు అలలు అస్సలు వినిపించవు ..కానీ ఎప్పుడైతే గుడి బయటకి అడుగు పెడతామో వెంటనే చాలా క్లియర్ గా సముద్రం అలల శబ్దం వినిపిస్తుంది ..అయితే సాయంత్రం అయితే ఈ శబ్దాన్ని గమనించలేరు ..కారణం ఇద్దరి దేవుళ్ళ సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కోరటం వలన ఇలా జరుగుతుంది అని ఆలయ పూజారులు చెప్తారు ..అంతే కానీ దీని వెనుక ఎలాంటి సైన్టిఫిక్ రీసన్ లేదని చెప్తారు.

ముందుగా చెప్పుకునంట్టు ప్రసాదం విశిష్టమైనది సాంప్రదయాకరమైన వాతావరణం లో దేవుడి కి 56 రకాల వంటాకాలు నైవేద్యం గా తయారు చేస్తారు ..ఇక ఈ ప్రసాదం తయారీకి కేవలం కుండలనే వాడతారు …మరో విశేషం ఏమిటి అంటే ప్రసాదం చేసేప్పుడు ఎలాంటి వాసనా రాదు ..రుచి కూడా ఉండదు కానీ దేవుడికి నైవేద్యం గా సమ్పరించాక అద్భుతమైన వాసనా మరియు రుచి తో కూడి ఉంటుంది అంట...ఇదంతా దేవుడి లీలనే అని చెప్తారు …

కృష్ణుడిని, బలరాముడిని అంతమొందించడానికి, కృష్ణుడి మామ అయిన కంసుడు వారిద్ధరిని మథురకి ఆహ్వానిస్తాడు.అందుకుఅకురుడికిరధాన్ని ఇచ్చి కృష్ణ-బలరాములను మధురకు కంసుడుతీసుకునిరమ్మంటాడు.శ్రీ కృష్ణ పరమాత్ముడు, బలరాముడు గోకులం నుంచి మథురాకి రధము పై బయలుదేరిన రోజుని పురస్కరించుకుని, జగన్నాథ రథ యాత్రను వేల సంవత్సరాలుగాజరుపుకుంటూ వస్తున్నారు.puri jagannath temple history and Highlights

పూరి లో వైభవంగా సాగే జగన్నాథరథ యాత్రలోపాలుపంచుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతి ఏట జరిగే ఈ రథ యాత్రరెండురోజుల పండుగగా ఉంటుంది. మొదటి రోజున, జగన్నాథస్వామివారిని, వారికుటుంబ సమేతంగా, జగన్నాథ స్వామి అలయంనుంచి మొదటిరధం లో అంగరంగ వైభవంగా నది వరకు తిసుకువేళతారు.అక్కడనుంచిప్రతిమలనుఒక పడవలో నది దాటించి,నదికి ఆవల ఉన్న మౌసి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకువెళ్తారు. మరుసటిరోజు, మౌసి అమ్మవారి ఆలయం నుంచి ఆ ప్రతిమలను నదికివద్దకు తీసుకువచ్చి,ఒక పడవపై వాటినిఇటు వైపు ఒడ్డుకి తరలిస్తారు. అక్కడేసిద్ధంగాఉండేరెండో రధం పై ఊరేగిస్తూ మేళ తాళల, భక్తుల కేరింతల మధ్య మరల జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకుంటారు.

ఇది ఆండీ పూరి జగన్నాథ్ స్వామి వారి గురించిన విశేషాలు…