నా సామిరంగ నయా అప్‌డేట్‌.. విలేజ్‌ అవతార్‌లో అల్లరి నరేశ్‌..!

నా సామి రంగ నయా అప్‌డేట్‌.. విలేజ్‌ అవతార్‌లో అల్లరి నరేశ్‌..!
Na Sami Ranga

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా లో అల్లరి నరేష్ అంజి పాత్రలో ఆడియెన్స్ ని అలరించనున్నారు.

నా సామిరంగ: యాక్షన్‌తో మొదలైంది మాయాజాలం!
Na Sami Ranga

ఈ పాత్ర కి సంబందించిన ఇంట్రో గ్లింప్స్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. వీడియో లో అల్లరి నరేష్ సూపర్ ఎనర్జిటిక్ గా ఉన్నారు. కింగ్ నాగార్జున తో ఉన్న సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయి. మరోసారి అల్లరి నరేష్ తనదైన మార్క్ ని ఈ అంజి పాత్రతో వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, అషికా రంగనాథ్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీరు కూడా వీడియో ని ఒక వేయండి : https://youtu.be/crHsOUOc3uY