సందీప్, శివాజీలను కడిగిపారేసిన నాగ్.. తేజ క్రూరత్వానికి వీడియో నిదర్శనం..

సందీప్, శివాజీలను కడిగిపారేసిన నాగ్.. తేజ క్రూరత్వానికి వీడియో నిదర్శనం..
Latest News

బిగ్‏బాస్ హౌస్‏లో మొన్నటి వరకు కండల వీరులు కొట్టుకునేవరకు వెళ్లారు. నువ్వా నేనా అన్న రేంజ్‏లో మీద మీదకు అరుస్తూ వెళ్లగా మిగతా ఇంటి సభ్యులు ఆపారు. ఇక ఆ తర్వాత ఎప్పటిలాగే అమర్ దీప్, యావర్, గౌతమ్, సందీప్ ల మధ్య చిన్నపాటి గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. చివరగా నాలుగో వారం పవరాస్త్ర గెలుచుకుని నాలుగో ఇంటి సభ్యుడు అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఇక వీకెండ్ వచ్చేసింది. ఈ వారం రోజులుగా బిగ్‏బాస్ హౌస్ లో జరిగిన టాస్కులు, కంటెస్టెంట్స్ ప్రవర్తనపై క్లాస్ తీసుకునేందుకు రెడీ అయ్యార్ హోస్ట్ నాగ్. గతవారమే కంప్లీట్ గా హోస్టింగ్ స్టైల్ మార్చారు నాగ్. ఇక ఈవారం హోస్టింగ్ తో మరింత అదరగొట్టారు. తాజాగా విడుదలైన ప్రోమోలో చేతిలో బెల్డ్ పట్టుకుని ఒక్కొక్కరి ఆట కట్టించేందుకు రెడీ అయ్యారు నాగ్. ఇక స్టేజ్ పైకి రావడంతోనే శివాజీ, తుప్పాస్ సంచాలక్ సందీప్ లను కడిగిపారేశారు.

Video Link : https://youtu.be/qc54vkkoCDk

సందీప్, శివాజీలను కడిగిపారేసిన నాగ్.. తేజ క్రూరత్వానికి వీడియో నిదర్శనం..
Nagarjuna

ముందుగా సంచాలక్ సందీప్ నువ్వు గుడ్డివాడివా అని .. కెమెరాలో ఏం జరుగుతుందో నీకు కనిపించలేదా అని శివాజీని అడగ్గా.. అరిచానని శివాజీ చెప్పాడు . గౌతమ్ తేజకు బెల్డ్ వేసి లాగినప్పుడు మాత్రమే చెప్పావని అన్నాడు .. తేజ గౌతమ్ మెడకు వేసి లాగుతునప్పుడు చెప్పలేదని.. ఆ టైంలో నీ గొంతు ఏమైందంటూ ఫైర్ అయ్యారు. సంచాలక్ గా సందీప్ మొత్తం ఫెయిల్యూర్ అని అంటూ క్లాస్ తీసుకున్నాడు. ఆ తర్వాత టేస్టీ తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేద్దామని అడగగా .. జైల్లో వేద్దామని శుభ శ్రీ చెప్పగా.. నేరుగా ఇంటికి పంపించడమే బెటర్ అని అంటూ సందీప్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈవారం సంచాలక్ సందీప్ తోపాటు.. టేస్టీ తేజకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున గారు .