ఇద్దరు వారసుల కోసం నానికి అన్యాయం!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Nagarjuna and Allu Aravind are convinced Dilraj over nani mca release

యువ హీరో నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని తాజాగా ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 23న విడుదల చేయాలని భావించారు. కాని ఆ సమయానికి అక్కినేని మరియు మెగా వారసుల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందుకే నాని చిత్రాన్ని వారం ముందే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

nani

అక్కినేని అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హలో’. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయబోతున్నారు. డిసెంబర్‌ 23న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మెగా వారి అబ్బాయి అల్లు శిరీష్‌ నటించిన ‘ఒక క్షణం’ చిత్రం కూడా క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతుంది. డిసెంబర్‌ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. నాగార్జున మరియు అల్లు అరవింద్‌లు కలిసి దిల్‌రాజును ఒప్పించి ‘ఎంసీఏ’ చిత్రాన్ని వారం ముందు అంటే డిసెంబర్‌ 15న విడుదలకు ఒప్పించినట్లుగా తెలుస్తోంది. వారం ముందు విడుదల అవ్వడం వల్ల వరుస సెలవులను నాని మిస్‌ అవుతాడని, భారీ కలెక్షన్స్‌ను దక్కించుకోలేడు అంటూ నాని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారసుల కోసం తమ హీరోకు అన్యాయం చేస్తున్నారని నాని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.