నాగార్జున ఫస్ట్‌టైం..!

nagarjuna big offer to boyapati srinu for naga chaitanya movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగార్జున తను నటించే సినిమాల విషయంలో మరియు నిర్మించే విషయంలో తొందరపాటు అస్సలు ప్రదర్శించడు అని, దర్శకుల వెంట నాగార్జున ఎప్పుడు పడడు అని, తన వద్దకు వచ్చిన దర్శకులతోనే సినిమాలు చేయడం, నిర్మించడం చేస్తాడనే టాక్‌ ఇంతకాలం ఉంది. అయితే మొదటి సారి నాగార్జున ఒక దర్శకుడికి ముందస్తు అడ్వాన్స్‌ ఇచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక సినిమాను నిర్మించేందుకు నాగార్జున చాలా ఆసక్తిగా ఉన్నాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బోయపాటి తర్వాత సినిమాగా చిరంజీవి 152వ చిత్రం ఉండాల్సింది. అయితే చిరు 151వ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. అది ప్రారంభం అయ్యి, విడుదల అయ్యే వరకు బోయపాటి మరో సినిమాను చేసే అవకాశం ఉంది. అందుకే నాగార్జున ఇచ్చిన భారీ ఆఫర్‌కు బోయపాటి శ్రీను ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా కోసం బోయపాటి దాదాపు 12 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో నాగార్జున చైతూ సినిమా కోసం ఏకంగా 13 కోట్లను ఆఫర్‌ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. నాగార్జున మొదటి సారి చైతూ కోసం భారీగా ఖర్చు చేయాలని భావిస్తున్నాడు. ఇదే సంవత్సరం చివర్లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. మరో వైపు చిన్న కొడుకు అఖిల్‌, విక్రమ్‌ కె కుమార్‌ల కాంభినేషన్‌లో ఒక భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నాడు.