జక్కన్నవి కూడా తప్పుడు లెక్కలేనా?

Rajamouli Showing Fake collections About Bahubali 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rajamouli Showing Fake collections About Bahubali 2

ఇటీవలే రాజమౌళి ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కలెక్షన్స్‌ పెంచి చూపడం మరియు ఎక్కువ థియేటర్లను చూపడం తనకు ఇష్టం ఉండదని, అదే మగధీర సమయంలో నిర్మాతకు నాకు విభేదాలు తెచ్చి పెట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. రికార్డుల కోసం తప్పుడు ప్రచారాలు చేయను అంటూ చెప్పిన రాజమౌళి ఇప్పుడు తప్పుడు లెక్కలు చూపుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కలెక్షన్స్‌ విషయం పక్కన పెడితే ‘బాహుబలి 2’ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న థియేటర్ల సంఖ్య విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది.

‘బాహుబలి 2’ తాజాగా 1060 కి పైగా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో 300లకు పైగా థియేటర్లలో మరియు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుందని వారు చెబుతున్నారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదని, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఈస్థాయిలో 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే అనుమానంగా ఉందని ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు అంటున్నారు.

జక్కన్న కళ్లు కప్పి ‘బాహుబలి’ నిర్మాతలు ఈ లెక్కలు చూపుతున్నారా లేక అందరితో పాటే తాను అనుకుని తన సినిమాకు కూడా తప్పుడు లెక్కలు చెప్పేందుకు జక్కన్న సై అన్నాడో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ‘బాహుబలి 2’ సినిమా ఆడుతున్న థియేటర్ల సంఖ్య విషయమై సోషల్‌ మీడియాలో కూడా తెగ చర్చ జరుగుతుంది. అసలు విషయం జక్కన్న క్లారిఫై చేయాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు:

‘బాహుబలి’ నుండి పూర్తిగా బయటకు..!