50 కోట్ల బడ్జెట్‌ 150 కోట్ల బిజినెస్‌

http://telugubullet.com/wp-content/uploads/2017/06/Pawan-Kalyan-Trivikram-Movi.jpg

పవన్‌ కళ్యాణ్‌ సినిమా అంటే ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా అయిదు ఆరు సినిమాలు ఫ్లాప్‌ అయినా కూడా పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా వస్తుంది అంటే అంచనాలు ఆకాశానికి నిచ్చనలు వేసుకుని మరీ పెరుగుతాయి. ఇక పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ అంటే ఫ్యాన్స్‌ను ఆపడం సాధ్యం అయ్యే పనే కాదు. అంతటి క్రేజ్‌ ఉన్న కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీని రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఆయనకు విడుదలకు ముందే 100 కోట్ల ప్రాఫిట్‌ రాబోతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

‘కాటమరాయుడు’ యావరేజ్‌గా నడిచినా కూడా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఇక సినీ వర్గాల వారు మరియు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. అందుకే సినిమాను అన్ని ఏరియాల్లో కూడా కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా 150 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. 50 కోట్ల చిత్రానికి 150 కోట్ల బిజినెస్‌ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కలు చూస్తుంటే పవన్‌ రేంజ్‌ ఏంటో తెలిసి పోతుంది.