పవన్‌ పద్దతి ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు..!

pawan-kalyan-25th-movie-teaser-postponed-on-dasara

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆయనకు అది 25వ సినిమా అవ్వడంతో ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో పవన్‌, త్రివిక్రమ్‌ల కాంభినేషన్‌లో వచ్చిన చిత్రాలు భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అవ్వడంతో పాటు, రికార్డుల మోత మ్రోగించాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సినిమాను భారీ ఎత్తున దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కూడా పలు కారణాల వల్ల ఆరు నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది, తాజాగా దసరాకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు.

పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఒక సాంగ్‌ బిట్‌ను వదిలారు కాని, టైటిల్‌ ఏంటి, పవన్‌ లుక్‌ ఎలా ఉండబోతుంది అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దసరాకు ఖచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టైటిల్‌పై దసరాకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్‌ ఇతరత్ర పనుల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌పై శ్రద్ద పెట్టలేక పోతున్నట్లుగా వారు చెబుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఒక వైపు రాజకీయాలు మరోవైపు సినిమాతో చాలా బిజీగా ఉంటున్నాడు. రాజకీయాల్లో బీజీ అయిన పవన్‌ సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నాడు. అందుకే సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. వచ్చే నెల నుండి మరింతగా రాజకీయాల్లో బిజీ కానున్నాడు. అప్పుడు త్రివిక్రమ్‌ సినిమా ఇంకా ఆలస్యం అవుతుందేమో. తన 25వ సినిమా విషయంలో పవన్‌ వ్యవహరిస్తున్న తీరును ఫ్యాన్స్‌ తప్పుబడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని, వెంటనే ఫ్యాన్స్‌ కోసం దసరాకు ఫస్ట్‌లుక్‌ను సిద్దం చేయాలని కోరుతున్నారు.