పవన్ కట్టడికి.. బిజెపితో కలిపి కొత్త వ్యూహం పన్నా చంద్రబాబు…!

Chandrababu
Chandrababu

ఏపీలో పొత్తులపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే టిడిపి, జనసేన మధ్య పొత్తు వాతావరణం నెలకొంది. అటు బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లి చంద్రబాబు బిజెపి నేతలతో పొత్తుల చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు పవన్ ను కట్టడి చేసే విధంగా బిజెపి ముందు మంచి ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. వారాహి యాత్ర,ఎన్డీఏలోకి ఎంట్రీతో పవన్ ఫుల్ జోష్ గా ఉన్నారు. అటు జనసేన గ్రాఫ్ సైతం అమాంతం పెరిగినట్లు సంకేతాలు వస్తున్నాయి. అందుకే ప్రత్యేక వ్యూహం పన్నారు.

ఏపీలో పొత్తులు లేకుంటే బిజెపి జీరో. ఈ విషయం ఆ పార్టీ హైకమాండ్ పెద్దలకు కూడా తెలుసు. అందుకే ఓట్లు సీట్లు పెంచుకోవాలన్న యోచనలో బిజెపి ఉంది. దీనిని గమనించిన బిజెపికి ఎదురెళ్లి చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి గాని టిడిపితో పొత్తు కుదుర్చుకుంటే 15 శాసనసభ, ఐదు ఎంపీ సీట్లు ఇస్తానని చంద్రబాబు బిజెపి అగ్రనేతల వద్ద ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులు కుదిరితే 40 నుంచి 50 స్థానాలను కోరే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు మాత్రం అందుకు సమ్మతించడం లేదు. ఎక్కువ స్థానాల్లో జనసేన గెలుపొందితే పవర్ షేరింగ్ కు పట్టుబడే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. జనసేన, బిజెపికి కలిపి 30 అసెంబ్లీ స్థానాలకు మించకూడదని చంద్రబాబు భావిస్తున్నారు.

అందుకే జనసేనతో సమానంగా బిజెపికి సీట్లు కేటాయించనున్నట్లు సంకేతాలిస్తున్నారు. తద్వారా బిజెపి నుంచి పవన్ పై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు.పవన్ తక్కువ సీట్లకే ఒప్పుకుంటే.. చంద్రబాబు పవర్ షేరింగ్ ప్రతిపాదన రాదన్నది భావిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ అగ్రనేతలు మౌనం దాల్చినట్టు సమాచారం. మరి చంద్రబాబు పాచిక పారుతుందో లేదో చూడాలి మరి.