Election Updates: తెలంగాణలో జనసేన ఘోర ఓటమిపై స్పందించిన పవన్ కళ్యాణ్

Election Updates: Pawan Kalyan reacts to Janasena's heavy defeat in Telangana
Election Updates: Pawan Kalyan reacts to Janasena's heavy defeat in Telangana

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఘోర ఓటమిపై స్పందించారు. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ అగ్రనాయకత్వానికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చేప్పారు. విజేతలందరికీ అభినందనలు అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం భవిష్యత్తు ఫలితాలకు గొప్ప దిక్సూచి అని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ – జనసేన కూటమిని గౌరవించి, ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో పోటీ జనసేనకు ఒక ప్రత్యేక మైలు రాయి అన్నారు.. తెలంగాణలో జనసేన తన తొలి అడుగును ఈ ఎన్నికలతో ప్రారంభించాలని సంకల్పించి అభ్యర్థులను బరిలో నిలిపాం. నా నిర్ణయాన్ని అభినందించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పారు పవన్‌ కల్యాణ్‌.