ఏపీ రైతులకు గుడ్ న్యూస్…మిచౌంగ్ తుఫాన్…

Good News for AP Farmers...Michaung Typhoon...
Good News for AP Farmers...Michaung Typhoon...

ఏపీ రైతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో… రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యంలో తేమశాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ధాన్యంలో తేమశాతం అస్సలు పట్టించుకోవద్దు, ధాన్యం సేకరించి వెంటనే బిల్లుకు తరలించాలన్నారు. 7 జిల్లాలలో 2లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. సదరు జిల్లాలలో డ్రయర్లు లేకుండా పరుగు జిల్లాలకు పంపాలి. అందుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా భరించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్‌జాం తుపాను రేపు తీవ్ర తుపానుగా బలపడనుంది. ఈ క్రమం రేపు మధ్యాహ్నంలోగా మచిలీపట్నం-నెల్లూరు మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.