బాలయ్య సినిమా కొత్త షెడ్యూల్… బాలయ్య ఫాన్స్ కి పండగే ..!

బాలయ్య సినిమా కొత్త షెడ్యూల్... బాలయ్య ఫాన్స్ కి పండగే ..!
Cinema News

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్‌ ఫిల్మ్‌ గా తెరకెక్కుతుంది . ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణను అనంతపురంలో ప్లాన్‌ చేశారని తెలుస్తుంది . ఈ నెల మూడో వారంలో ఈ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ అనంతపురంలో జరగనుందంట ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయంట . ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.

బాలయ్య సినిమా కొత్త షెడ్యూల్... బాలయ్య ఫాన్స్ కి పండగే ..!
Balakrishna

అన్నట్టు ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదని ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.