చిరునే కాదనగలదా? నిజమెంత?

Kajal reject Sye Raa Narasimha Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతుంది అంటూ ఎంతో మంది పేర్లు వినిపించాయి. చివరకు కాజల్‌ అగర్వాల్‌తో చిరంజీవి తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’లో రొమాన్స్‌ చేసి సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. కాజల్‌తో చిరంజీవి వేసిన స్టెప్పులకు మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఫిదా అయ్యారు. చిరంజీవితో నటించే అవకాశం రావడంతో కాజల్‌ స్థాయి మరింతగా పెరిగింది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవితో 150వ చిత్రంలో నటించిన కాజల్‌కు ఆయన 151వ చిత్రంలో కూడా ఆఫర్‌ వచ్చిందని, కాని కాజల్‌ ఆ ఆఫర్‌ను తిరష్కరించింది అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ముఖ్య పాత్రను నయనతార చేయబోతుంది. మొదట నయనతారను హీరోయిన్‌గా అంతా భావించారు. కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నదాని ప్రకారం నయన ఒక కీలకమైన నెగటివ్‌ రోల్‌ను పోషిస్తుందని, తప్పకుండా నయన్‌ పాత్ర సినిమాకు హైలైట్‌ అవుతుందని అంటున్నారు. తెలుగు సినిమా అంటే ఖచ్చితంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండాలి, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అంటే హీరోకు జోడీగా హీరోయిన్‌, ఇద్దరి మద్య రొమాన్స్‌, కెమిస్ట్రీ వర్కౌట్‌ అవ్వడం జరగాలి. అందుకే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేయడం జరిగింది.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌కు ముందు కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని దర్శకుడు సురేందర్‌ రెడ్డి మరియు నిర్మాత రామ్‌ చరణ్‌ భావించారు. కాని అనూహ్యంగా కాజల్‌ అగర్వాల్‌ తాను సైరాలో నటించలేను అని చెప్పడంతో మరో దారిలేక వారు ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేయడం జరిగింది. కాజల్‌ ఎందుకు నో చెప్పింది అనే విషయంపై క్లారిటీ లేదు. కాని కొందరు కాజల్‌ సన్నిహితులు మాత్రం చిరంజీవితో చిన్న పాత్ర చేయడం అయినా అదృష్టం. అలాంటిది అమితాబచ్చన్‌, చిరంజీవి వంటి స్టార్స్‌ ఉన్న సినిమాలో కాజల్‌ను నటించమంటే ఆమె ఎలా నో చెబుతుందని అంటున్నారు. సైరా కోసం కాజల్‌ను సంప్రదించడం అబద్దం, అందుకు కాజల్‌ నో చెప్పడం కూడా పరమ అబద్దం అంటూ కాజల్‌ సన్నిహితు కుండ బద్దలు కొట్టేస్తున్నారు.