‘స్పైడర్‌’పై పబ్లిక్‌ మరియు ఫ్యాన్స్‌ అభిప్రాయం

spyder-movie-public-talk-and-mahesh-fans-reviews

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగి పోయాయి. 80 కోట్లతో అనుకున్న ఈ సినిమాను చివరకు 110 కోట్ల బడ్జెట్‌కు తీసుకు వెళ్లి ముగించారు. మూడు భాషల్లో విడుదల చేసి, మూడు భాషల్లో సక్సెస్‌ కొట్టి 110 కోట్లకు 250 కోట్ల వసూళ్లను సాధిస్తాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంను వ్యక్తం చేశారు. అయితే సినిమా ఆ స్థాయిలో లేదు అని, ఖచ్చితంగా సినిమా పెట్టిన పెట్టుబడిని సైతం వసూళ్లు చేసే స్థాయిలో లేదు అంటూ రివ్యూవర్స్‌ అంటున్నారు. రివ్యూలు బ్యాడ్‌గా రావడంతో అప్పుడే పబ్లిక్‌ నుండి సినిమాకు అంతగా రెస్పాన్స్‌ లేదు. కొన్ని ఏరియాల్లో సినిమా థియేటర్లు అప్పుడే ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాకు మొదటి రోజే థియేటర్లు హౌస్‌ ఫుల్‌ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

రివ్యూలతో పాటు ప్రేక్షకుల రెస్పాన్స్‌ కూడా బ్యాడ్‌గా ఉంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. చాలా ఆశించి వస్తే సినిమాలో ఏమీ లేదని, మహేష్‌ కనిపించాడు కాని, సినిమాలో మాత్రం మురుగదాస్‌ నిపించలేదు అని, మురుగదాస్‌ స్థాయి సినిమా ఇది కానే కాదు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌బాబు లుక్స్‌ పరంగా బాగున్నాడు, నటన పరంగా కూడా పర్వాలేదు. హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్స్‌ మరియు ఫైటింగ్స్‌ బాగా చేశాడు అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే టాక్‌ బయట ప్రచారం జరుగుతుంది. సాదారణ ప్రేక్షకులు మౌత్‌ టాక్‌తో అప్పుడే స్పైడర్‌లో మ్యాటర్‌ లేదు అంటూ తేల్చి చెప్పేశారు.

ఇక ఫ్యాన్స్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా నుండి బయటకు వస్తున్న వారి మొహాల్లో రంగు కనిపించడం లేదు. చాలా నీరసంగా బయటకు వస్తున్న ఫ్యాన్స్‌ను చూస్తుంటే వారికి కూడా సినిమా నచ్చలేదు అనిపిస్తుంది. ఫ్యాన్స్‌ ముందు మైక్‌ పెడితే మాత్రం సినిమా ఆహా.. ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి సినిమా ఇటు ప్రేక్షకులను అటు అభిమానులను కూడా ఆకట్టుకోలేక పోయింది. విశ్లేషకుల మాటే ప్రేక్షకుల నోట వినిపిస్తుంది. దసరా బరిలో దిగిన స్పైడర్‌ ఆకట్టుకోలేక పోయాడు అని చెప్పక తప్పడం లేదు.