బాద్షా భజనలో బండ్ల… ఎందుకో ?

Bandla Ganesh Comments on NTR about Jai Lava Kusa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
చిత్రసీమలో ఓ హీరోని పొగడాలి అంటే నిర్మాత బండ్ల గణేష్ ని చూసి నేర్చుకోవాలని టాలీవుడ్ లో ఓ బడా ప్రొడ్యూసర్ జోక్ చేస్తుంటాడట. చేసింది కొన్ని సినిమాలే అయినా ఆడియో ఫంక్షన్స్ లో హీరోల్ని కవుల్ని మించి పొగడటంలో బండ్ల గణేష్ ఏ స్థాయిలో రెచ్చిపోతాడో జనానికి బాగా తెలుసు. అయితే ఆ కాకాలు కొద్ది కాలమే పని చేశాయి. నటుడు బ్రహ్మాజీ పరోక్షంగా చేసిన కామెంట్స్ తో హర్ట్ అయిన గణేష్ ఓ వెబ్ ఛానల్ కి భారీ ఇంటర్వ్యూ ఇచ్చేసారు. అందులో బ్రహ్మాజీ మీద చీప్ కామెంట్స్ చేయడంతో పాటు తనతో పని చేసిన హీరోలు అందరి మీద పొగడ్తలు కురిపించాడు. పవన్ కి దూరం కావడం తన అహం వల్లేనని, ఎవరో చెప్పిన మాటలు విని ఎన్టీఆర్ ని అపార్ధం చేసుకున్నానని చెప్పి అందరు హీరోల ఫాన్స్ ని కూల్ చేసేసాడు బండ్ల. త్వరలో భారీ స్థాయిలో సినిమాలు తీయబోతున్నట్టు ప్రకటించాడు. ఆ ఇంటర్వ్యూ వచ్చి దాదాపు ఏడాది గడిచింది కానీ ఆ భజనలు ఏమీ పనిచేసినట్టు లేదు. బండ్ల నిర్మాతగా భారీ చిత్రం కాదు కదా కనీసం చిన్న సినిమా కూడా మొదలు కాలేదు.

పవన్, చిరుకి కి అనుకూలంగా ఈమధ్య రామ్ గోపాల్, కత్తి మహేష్ మీద చెలరేగిన బండ్ల ఆల్మోస్ట్ సైలెంట్ గా వుంటున్నారు. అలాంటిది ఉన్నట్టుండి ఆయన ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించాడు. ఒకప్పుడు రెమ్యునరేషన్ విషయంలో చరణ్ తో పోల్చి ఎన్టీఆర్ ని తక్కువ చేసేలా మాట్లాడిన బండ్ల ఒక్కసారిగా ట్రాక్ మార్చేశాడు. రాత్రే ఆయన లవకుశ చూశాడట. ఆ తర్వాత అసలు నిద్ర పట్టలేదంట. ఎన్టీఆర్, ఎస్.వీ. ఆర్ తర్వాత నటనలో తారక్ బెస్ట్ అంటూ రెచ్చిపోయాడు. ఈ పొగడ్తలో ఎక్కడా మెగా హీరోల ప్రస్తావన తేలేదు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికే బండ్ల ఈ పాట్లు పడుతున్నట్టు ఫిలిం నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. చూద్దాం బండ్ల భజన వెనుక ఉద్దేశం ఏమిటో ? ఆ భజనకి అలవాటు పడ్డ మెగా క్యాంపు రియాక్షన్ ఏమిటో ?.

Bandla Ganesh tweet on NTR about Jai Lava Kusa