మ‌హేష్ సినిమా కోసం మేక‌ప్ వేసుకుంటున్న బండ్ల గ‌ణేష్‌!

bandla ganesh acts in mahesh movie

న‌టుడిగా, నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో రాణించిన బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల తాను రాజ‌కీయాల‌కి గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్న ఆయ‌న షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కాని ఆయ‌న‌కి నిరాశే ఎదురైంది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గ‌ణేష్ వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. అయితే రాజ‌కీయాల నుండి త‌ప్పుకున్న ఆయ‌న మ‌ళ్ళీ సినిమాల‌తో బిజీ కావాల‌ని అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో మ‌హేష్‌- అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో బండ్ల గ‌ణేష్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. న‌టుడిగానే కాదు నిర్మాత‌గాను మంచి సినిమాలు చేయాల‌ని బండ్ల గ‌ణేష్ భావిస్తున్నార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.