బండ్ల గణేష్ పై పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్న ప్రముఖ కమెడియన్

Comedian Prudhvi Satires On Congress Leader Bandla Ganesh

బండ్ల గణేష్ యవ్వారం మాములుగా లేదు. చిన్న సైజు కమెడియన్ గా చిన్నాచితకా పాత్రలు చేసే బండ్ల గణేష్ ఒక్కసారే బడా ప్రొడ్యూసర్ అయిపోయి రవితేజ తో ఆంజనేయులు సినిమా తీశాడు. ఆ తరువాత వరుసగా పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలను తీసి, స్టార్ ప్రొడ్యూసర్ అనిపిచ్చుకున్నాడు. ఎన్టీఆర్ తో బాద్షా, రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే తీశాక, 2015 లో మళ్ళీ ఎన్టీఆర్ తోనే టెంపర్ సినిమా నిర్మించి హిట్ కొట్టాడు. మళ్ళీ ఏమైందో ఆ సినిమా తరువాత ఇప్పటివరకు ఏ సినిమాని కూడా నిర్మించలేదు. ఇన్నేళ్లు ఈ బండ్ల గణేష్ యాడ పోయినట్టు అనుకుంటుండగా, హఠాత్తుగా సరిగ్గా రెండు నెలల ముందు మీడియా ముందు ప్రత్యక్షమై, రాహుల్ గాంధీని కలిసి, కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని, తాను రాబోతున్న తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబోతున్నట్లు ప్రకటించి, ఊకదంపుడుగా అన్ని మీడియా ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

prudvi-bandla-ganesh

ఇంతే చేస్తే, నేను బండ్ల గణేష్ ఎందుకవుతానని అనుకున్నాడేమో ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఏకంగా ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. కోయిల ముందే కూసినట్లుగా ఈ ప్రమాణ స్వీకారం ఏమిటయ్యా బండ్ల అని అడిగితే “సీటు పక్కా, కాంగ్రెస్ రాష్ట్రంలోకి అధికారంలోకి రావడం పక్కా, ఈ బండ్ల గణేష్ ఎమ్మెల్యే అవ్వడం పక్కా” అని శివగామి శపథం చేశాడు. అతని ఇంటర్వ్యూ ముచ్చట్లు మాంచి కామెడీ పంచుతుండడంతో, పడి పడి చూసిన జనాలకి, ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే ఏదో సపోర్ట్ ఉండుంటుంది అని అనుకొని, ఏమో గుర్రం ఎగరావచ్చు లా బండ్ల బాబు కూడా ఎమ్మెల్యే అవ్వావచ్చు అని కొందరైతే అనుకున్నారు. తీరా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బండ్ల గణేష్ పేరు లేకపోయేసరికి, బండ్ల గణేష్ ఎలా ఫీల్ అయ్యాడో తెలియదుగానీ, తనకు సీటు రాకపోవడంతో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, ఇంటర్వ్యూలు ఇక బండ్ల గణేష్ ఇవ్వకపోతే, ఎంటర్టైన్మెంట్ ఎలా అని బండ్ల కామెడీ ఫ్యాన్స్ తెగ ఇదైపోయారు. కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేష్ కి ఏమి మిఠాయి ఇచ్చి, ఓదార్చిందో తెలీదుగానీ వెంటనే మళ్ళీ మీడియాలోకి ఫ్రత్యేక్షమై వెంటవెంటనే ఇంటర్వ్యూలు ఇస్తుండడంతో బండ్ల ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. ఇదివరకటి అహంకారం లాంటి ఆత్మస్థైర్యం అయితే ఇప్పుడు బండ్ల గణేష్ లో కనపడకపోయినా, అత్యుత్సాహం మాత్రం చూపి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే, బ్లేడ్ తో గొంతు గోసుకుంటా అని ప్రకటించాడు.

bandla-ganesh-trump

ఇలా బ్లేడ్ శపథం చేసేసరికి, టాలీవుడ్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న పృథ్వీ బండ్ల గణేష్ శపథంపై ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. పృథ్వీ ఏమన్నాడంటే “నేను కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన రోజులనుండి బండ్ల గణేష్ తో స్నేహం ఉంది. ఆ తరువాత అతను బడా నిర్మాత అయ్యేసరికి చాలా సంతోషించాను, కానీ రాజకీయాల్లోకి అతను వస్తాడని అస్సలు ఊహించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరి బరిలోకి దిగుతున్న విషయం విని ఆశ్చర్యపోయాను. కానీ, బండ్ల గణేష్ బ్లేడ్ శపథం చేసేసరికి ఒక్కసారే కంగుతిన్నాను. ఈ విషయంలో బండ్ల ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఈ బ్లేడ్ శపథం విషయాన్నీ ఎన్నికలకి ముందే పోలీస్ అధికారులకి చెప్పి, బండ్ల గణేష్ ని కాపాడాలని, అతన్ని ఆత్మహత్య నుండి కాపాడాలి” అని అన్నాడు. బండ్ల గణేష్ చాలా సమర్థుడని, తాను తలుచుకుంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో కూడా ఫోటో తీయించుకోగలడని, తనకైతే అంత లౌక్యం లేదని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చెప్పాడు.

Congress-Leader-Bandla-Gane