మీటులో నాపేరు లేకపోవడం వారికి షాక్ : వర్మ

ram gopal varma smiling face

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే, ఏమి మాట్లాడిన అది వైరల్, ప్రస్తుతం లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు వర్మ. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కంటే ముందే విడుదల చేస్తానని సంచలన ప్రకటనే చేశాడు. రాంగోపాల్ వర్మతో తాజాగా మీడియాతో పలు ఆసక్తికర విషయాల గురించి స్పందించాడు. ముఖ్యంగా మీటు ఉద్యమం పైన తనదైనా శైలిలో జవాబు ఇచ్చాడు వర్మ. మీటు లో తనపేరు పేరు తప్ప వేరే వాళ్ళ పేర్లు రావడం విచిత్రంగా ఉన్నది అన్నారు. గతంలో నామీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి, ఈ నేపద్యంలోనే నా పేరు కూడా రావాలని కొందరు అనుకున్నారు. నా పేరు రాకపోవడం అనేది కొందరికి పెద్ద షాక్ న్యూస్.

laxmi's ntr movie

మీటు ఉద్యమంలో ఆరోపణలు ఎదురుకుంటున్నా వాళ్ల గురించి నన్ను ఏమి అడగవద్దు అన్నారు. నేను ఎప్పుడు ఆడవాళ్ళ గురుంచి అవి ఇవి మాట్లాడుతూ ఉంటాడు. నేను మాత్రం అంత మంచి వాడిని కాదు అని నా నమ్మకం. నాకు దొరికిన వాళ్ళు అందరు నన్ను మంచివాడిని అనుకోవడం వాళ్ల పొరపాటు తనం అన్నారు. ఇక మీదట సినిమాలు నిర్మిస్తానని, కొత్తగా వారికి అవకాశం కల్పిస్తాను అన్నారు. తాజాగా తాను నిర్మించిన భైరవ గీత చిత్రం ప్రస్తుత ట్రెండ్ కి అనుకూలంగా ఉంటుంది అని తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుంది అన్నారు.