బండ్ల బాబు ఆ ప్రయత్నాలు చేస్తున్నాడట

బండ్ల గణేష్ ఆ మద్య కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి షాక్ ఇచ్చాడు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ బజన చేస్తూ ఉండే బండ్ల పవన్ ఫాన్స్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేశాడు. తెలంగాణ ఎలక్షన్స్ నేపద్యంలో తెరాస నాయకులపైనా తనదైనా మాటలతో దాడిచేశాడు. కాంగ్రెస్ తరుపున ఏదైనా మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డాడు. రీసెంట్ గా బండ్ల గణేష్ తో జరిగిన ఇంటర్వ్యూ లో.. మరల సినిమాలు నిర్మిస్తానని, ఓ రెండు మూడు కథలను సిద్దం చేస్తున్నాను. పెద్ద స్టార్స్ తో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తాను అన్నారు.

ఈ నేపద్యంలోనే బండ్ల గణేష్ తెరాస నాయకులపైన మాటల యుద్ధంకు దిగ్గాడు తెరాస నాయకులు కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరధ పేరుతో దోచుకుంటున్నారు. అని ఎద్దేవా చేశాడు. తెరాస నాయకులూ ప్రజాసేవ పేరుతో జనాలను హింసిస్తున్నారు.ఎదో ఒకరోజు ప్రజలే తగిన సమాధానం చెపుతారు. నేను మాత్రం అలా కాదు అన్నారు. రాజకియలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ, సినిమాలు నిర్మిస్తాను అన్నారు లేకపోతే నా ఫ్యామిలీ ఇబ్బందిలో పడుతుంది . ఇప్పటికే సగం అప్పులతో ఉన్నాను. అందుకే మరోసారి సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నాను. నేను సినిమాలు చెయ్యకపోతే ఇబ్బందులు ఎదురుక్కోవలిసి ఉంటుంది అన్నారు.