మిథాలీరాజ్‌గా సమంత…

samantha to do in women Cricketer Mithali Raj Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అటు సినిమాల్లోనూ, ఇటు పెళ్లిఏర్పాట్ల‌లోనూ బిజీగా ఉంది స‌మంత‌. అక్టోబ‌రు ఆరున గోవాలో నాగ‌చైత‌న్య‌తో ఆమె వివాహం జ‌ర‌గ‌నుంది. అక్కినేని కుటుంబంతో పాటు… స‌మంత ఫ్యామిలీ కూడా పెళ్లి ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. హిందూ, క్రిస్టియ‌న్ రెండు ప‌ద్ధ‌తుల్లో పెళ్లి జ‌ర‌గ‌నుంది. అటు పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టిస్తానంటోంది స‌మంత‌. సాధార‌ణంగా గ‌తంలో హీరోయిన్లు పెళ్లి త‌రువాత సినిమాలు మానేసేవారు. కొంత‌కాలం ఆగి… వారి పిల్ల‌లు పెరిగి పెద్ద‌యిన తరువాత అత్త‌, వ‌దిన, అమ్మ పాత్ర‌ల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టేవారు. ఇప్ప‌టి హీరోయిన్లు మాత్రం పెళ్లి త‌ర్వాతా కెరీర్ కు బ్రేక్ ఇవ్వ‌డం లేదు. ముఖ్యంగా నార్త్ లో ఈ ట్రెండ్ కొన‌సాగుతోంది. ఐశ్వ‌ర్యారాయ్, క‌రీనా క‌పూర్, విద్యాబాల‌న్ వంటి వారు పెళ్లికి ముందులానే… త‌రువాత ఎలాంటి ఆటంకాలు లేకుండా కెరీర్ కొన‌సాగించారు. వారిలానే స‌మంత కూడా వివాహం త‌ర్వాత కూడా మునుప‌టిలానే సినిమాలు చేయాల‌ని భావిస్తోంది. అయితే మిసెస్ నాగ‌చైత‌న్య‌గా ఆమె న‌టించే తొలిచిత్రం ఏమిటన్న‌దానిపై కొన్ని రోజుల నుంచి అనేక ఊహాగానాలొస్తున్నాయి. తాజాగా ఆమె వివాహం అనంత‌రం న‌టించే సినిమా ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది.

ఇటీవల బాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు కొనసాగుతుంది. ఎంఎస్‌ ధోని, సచిన్‌ టెండూల్కర్‌, మేరీకోమ్‌ చిత్రాలు వచ్చిన తర్వాత పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఇంకా పలువురి క్రీడాకారుల జీవిత చరిత్రలతో సినిమాలు వస్తున్నాయి. అదే దారిలో టీం ఇండియా మహిళ కెప్టెన్‌ అయిన మిథాలీరాజ్‌ బయోపిక్‌ను తీసేందుకు ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వయోకాన్‌18 ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆమెతో భారీ మొత్తానికి ఒప్పందం కూడా చేసుకుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఈ సమయంలోనే అప్పుడే కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిథాలీ రాజ్‌ పాత్రను టాలీవుడ్‌ బ్యూటీ సమంత చేయబోతుందని, అందుకోసం సమంత అగ్రిమెంట్‌ కూడా ఇచ్చిందనే వార్తలు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో గుప్పుమంటున్నాయి.

ఈ వార్తల్లో నిజం లేదని కాస్త లోతుగా ఆలోచిస్తే అనిపిస్తుంది. మిథాలీరాజ్‌ బయోపిక్‌ను కేవలం తెలుగు మరియు తమిళంలోనే తెరకెక్కించబోవడం లేదు. బాలీవుడ్‌లో తెరకెక్కించి అన్ని భాషల్లో డబ్‌ చేస్తారు. అలాంటప్పుడు సమంత హీరోయిన్‌గా ఈ బయోపిక్‌లో ఎలా నటిస్తుంది. సమంత గురించి వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అబద్దం అని సినీ వర్గాల్లో కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిథాలీ రాజ్‌ బయోపిక్‌కు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎంపిక చేసే అవకాశం ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయితేనే సినిమాకు క్రేజ్‌ దక్కుతుంది. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్న నేపథ్యంలో తప్పకుండా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిను ఎంపిక చేస్తారు అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అమ్మాయి అయిన మిథాలీ రాజ్‌ బయోపిక్‌పై టాలీవుడ్‌లో ఆసక్తి నెకొంది. తెలుగులో ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.