రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ మంత్రి అరుణ భర్త

http://telugubullet.com/wp-content/uploads/2017/06/Dk-Aruna-Husband-Bharataha-.jpg

మాజీ మంత్రి DK అరుణ భర్త , DK భరత సింహారెడ్డి ప్రయాణిస్తున్న కారుకి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం మహబూబ్ నగర్ జిల్ల్లా , మరికల్ మండలం , ఎలిగండ్ల వద్ద జరిగింది. భరత సింహారెడ్డి మహబూబ్ నగర్ లో తన పర్సనల్ పనిని ముగుంచుకొని ఇంటికి వస్తున్నాడు, అటుగా వస్తున్న మరో కారు అదుపుతప్పి భరత సింహారెడ్డి కారుని డీ కొట్టింది. భరత సింహారెడ్డి డ్రైవర్ కారుని కంట్రోల్ చేయటం వలన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఆక్సిడెంట్ లో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఆక్సిడెంట్ లో భరత సింహారెడ్డి కొంచెం గాయపడ్డాడు. గాయపడిన భరత సింహారెడ్డి ని అంబులెన్స్ ద్వార హాస్పిటల్ కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న DK అరుణ హైదరాబాద్ నుంచి బయలుదేరింది.