గ్రూపు-1 పరీక్ష రద్దుపై ఫైర్ అయినా డీకే అరుణ ..!

DK Aruna is under fire for cancellation of Group 1 exam..!
DK Aruna is under fire for cancellation of Group 1 exam..!

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మళ్లీ గ్రూప్ -1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు అవుతున్న గ్రూప్-1 పరీక్షను సక్రమంగా నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. పేపర్ లీకేజీ లతో , అస్తవ్యస్త నిర్వహణతో నిరుద్యోగుల జీవితాలతో ఈ పోరంబోకు ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. టీఎస్పీఎస్సీ బాధ్యతారాహిత్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం అప్పులు చేసి అష్ట కష్టాలు పడి చదువుతున్న నిరుద్యోగులను అగమ్య గోచర స్థితిలోకి నెట్టివేసింది.

ఓ వైపు వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం పరీక్ష రాస్తున్న అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోవడానికి ఖర్చులు సాకుగా చూపి నిర్లక్ష్యం చేసినందుకు ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు మళ్లీ అప్పులు చేసి పుస్తకాలతో కుస్తీ పడాల్సిన అవసరం ఏర్పడింది. కెసిఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గు ఉన్న వెంటనే విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పి, పూర్తిస్థాయిలో టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేసి పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాను.

మద్యం నోటిఫికేషన్ పై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిఫికేషన్ పై లేదు.బయోమెట్రిక్ విధానం పెడితే ఖర్చవుతుందని, ప్రభుత్వం కక్కుర్తి పడడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం, మద్యం నోటిఫికేషన్ తప్ప, ఏ నోటిఫికేషన్ సక్రమంగా జరగలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్, పరీక్షలు నిర్వహించే విధానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గ్రూప్ -1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు ,ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలి. Tspsc ని వెంటనే ప్రక్షాళన చేయాలి, చైర్మన్ ఈ ఘటనకు భాద్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసింది .