నానికి ఎంత ధైర్యం… చెప్పి మరీ చేస్తున్నాడు.

Nani Ninnu Kori Theatrical Trailer

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎవరైనా మాది కొత్తగా వుండే సినిమా, సరికొత్త కథ, కధనం, తొక్క, తోలు అంటూ కబుర్లు చెప్పేస్తారు. కానీ ఆ రొటీన్ వ్యవహారానికి గండి కొట్టాడు నాచురల్ స్టార్ నాని. నేడు విడుదల అయిన నిను కోరి థియేట్రికల్ ట్రైలర్ లో ఈ మార్పుని స్పష్టంగా చూడొచ్చు. ఇది హమ్ ఆప్ కె హై కౌన్ సినిమా కథ అంటూ హీరోతోటే చెప్పించేసారు. ఇక దానికి తగ్గట్టే ట్రైలర్ కూడా కథ ని ముందుగానే రివీల్ చేశారు. భారతీయ విలువలకి భిన్నంగా భర్త దగ్గరనుంచి ప్రియురాలిని వెనక్కి తెచ్చుకునే ఓ ప్రియుడి కథ ఇది అని అర్ధం అవుతోంది. సబ్జెక్టు కాస్త సంస్కృతికి భిన్నంగా వుంది కాబట్టి ఒక్కసారే థియేటర్ లో చూస్తే ప్రేక్షకుడు ఒప్పుకుంటాడో, లేదో అని ముందుగానే స్టోరీ లో కీ పాయింట్ ని జనాలకి తెలిసేట్టు ట్రైలర్ కట్ చేశారు. ఏదేమైనా హీరో నాని ధైర్యాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. స్టోరీ ఏంటో, దానికి ఏ సినిమా స్ఫూర్తి అనేది చెప్పి మరీ కొత్త రసినిమా రిలీజ్ చేస్తున్నాడు.