బాలీవుడ్‌ సంస్థ చేతికి ‘దేవదాస్‌’లు…!

Nagarjuna Devadas Movie Release Get Soon

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్‌ల జోరు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆ దారిలోనే తెరకెక్కిన చిత్రం ‘దేవదాస్‌’. కింగ్‌ నాగార్జున, నానిలు కలిసి నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల చివర్లో సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ ఈ చిత్రంను నిర్మించాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు అన్ని ఏరియాల్లో నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. అందుకు సంబంధించిన పక్రియ కూడా ప్రారంభం అయ్యింది. ఈ సమయంలోనే బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వయాకాం 18 సంస్థ ఈ చిత్రంను హోల్‌సేల్‌ పంపిణీ హక్కులను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

devadas-movie

అశ్వినీదత్‌ పెట్టిన పెట్టుబడిని దాదాపు 15 శాతం అధనంగా సదరు సంస్థ చెల్లించి రైట్స్‌ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో విడుదల కాబోతుంది. బాలీవుడ్‌ సంస్థ ఈ చిత్రంపై ఆసక్తి చూపించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. దసరాకు ముందు రాబోతున్న ఈ చిత్రం పండుగను రెండు వారాల ముందుగానే తీసుకు వస్తుందని అక్కినేని మరియు నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించిన విషయం తెల్సిందే. దేవదాస్‌ చిత్రం టీజర్‌ మరియు పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో సదరు బాలీవుడ్‌ సంస్థ భారీ మొత్తం వ్యచ్చించి సినిమా రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

devadas-movie-release