చైతూ పెళ్లికొడుకాయనే…

Nagarjuna posted Naga Chaitanya bridegroom photo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మ‌రికొద్ది గంట‌ల్లో నాగ‌చైత‌న్య‌, స‌మంత మూడుముళ్ల బంధంతో ఒక్క‌టి కానున్నారు. అక్కినేని, ద‌గ్గుబాటి కుటుంబాలు వివాహ వేడుక కోసం గోవాలో విడిది చేశాయి. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లిరోజు ఉద‌యం వ‌రుడిని పెళ్లికుమారుడిని చేస్తారు. ఈ వేడుక‌ను గోవాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. నాగ‌చైత‌న్య‌ను పెళ్లికొడుకుగా చూసుకుని తండ్రి నాగార్జున, మామ‌య్య వెంక‌టేశ్ మురిసిపోయారు. నాగ‌చైత‌న్య పెళ్లికొడుకును చేసిన ఫొటోను ఈ ఇద్ద‌రు హీరోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మ‌ధ్య లో పెళ్లికొడుకు నాగ‌చైత‌న్య ఒక ప‌క్క నాగార్జున‌, మ‌రో ప‌క్క వెంక‌టేశ్ నిల్చుని ఉన్న ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అల్లుడి పెళ్లికొడుకు ఫంక్ష‌న్ లో దిగిన ఫొటో… చూస్తుండ‌గానే ఎంత పెద్ద‌వాడైపోయాడో, కంగ్రాట్స్ చై అని వెంక‌టేశ్ పోస్ట్ చేశాడు. అటు కోడ‌లిగా అక్కినేని కుటుంబంలోకి అడుగుపెడుతున్న స‌మంత‌కు వెల్ కం చెబుతూ అక్కినేని, ద‌గ్గుబాటి కుటుంబాలు ఓ వీడియో రూపొందించాయి. చై, స‌మంత‌ల‌కు ఈ వీడియో గురించి తెలియ‌దు. వివాహం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ వీడియోను ప్ర‌ద‌ర్శించి స‌మంత‌ను స‌ర్ ప్రైజ్ చేయ‌నున్నారు. వీడియోలో నాగార్జున‌, అమ‌ల‌, అఖిల్, సుమంత్ తో పాటు వెంక‌టేశ్, రానా ఇత‌ర కుటుంబ స‌భ్యులు న‌టించారు. మ‌రోవైపు టీవీ చాన‌ళ్లు, వెబ్ సైట్లు చై, సామ్ పెళ్లివేడుకకు అత్యంత ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నాయి.

ఉద‌యం నుంచి చాన‌ళ్లు, వెబ్ సైట్ల‌లో పెళ్లికి సంబంధించిన విశేషాల వార్త‌లే ఎక్కువ‌గా ఉంటున్నాయి. సోష‌ల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్ గా ఉంది. చైత‌న్య‌కు, స‌మంత‌కు ఫ్యాన్స్ శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఎక్కువ‌మంది అభిమానులు ఈ సంద‌ర్భంగా గౌత‌మ్ మీన‌న్ పేరును ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తున్నారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ‘ఏ మాయ చేశావే’ చిత్రం ద్వారా ఒక‌రికొక‌రు ప‌రిచ‌యమ‌య్యారు స‌మంత‌, చైత‌న్య‌. వీరిద్ద‌రి ప్రేమ‌కు బీజం వేసింది గౌతమ్ మీన‌న్ అని, ఆయ‌న ఫొటోను పూజ‌గ‌దిలో పెట్టుకుని జీవితాంతం పూజించుకోవాలని అభిమానులు వారికి స‌ల‌హాలు ఇస్తున్నారు.