ఎన్టీఆర్‌ కోసం ప్లాన్‌ మార్చిన త్రివిక్రమ్‌.. ఎందుకంటే!

trivikram got new story to ntr next movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘జైలవకుశ’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్న ఎన్టీఆర్‌ తర్వాత సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్‌ 25వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్‌ త్వరలోనే ఎన్టీఆర్‌తో సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు. వచ్చే నెలలో సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లబోతున్నారు. ఎన్టీఆర్‌ కోసం దాదాపు రెండు సంవత్సరాల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ ఒక యాక్షన్‌ కథను సిద్దం చేశాడు. ఆ కథ ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చిందట. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు సంవత్సరాలుగా అనుకుంటున్న కథ కాకుండా త్రివిక్రమ్‌ తాజాగా ఒక స్టోరీ లైన్‌ సిద్దం చేశాడు. ఆ స్టోరీతో ఎన్టీఆర్‌ సినిమా చేయబోతున్నాడు. 

యాక్షన్‌ చిత్రం కాకుండా ఎన్టీఆర్‌తో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాన్ని త్రివిక్రమ్‌ చేయాలని భావిస్తున్నాడు. మాస్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ గతంలో పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్రలు చేశాడు. అయితే యాక్షన్‌ పాత్రల్లోనే ఆయన ఫ్యాన్స్‌ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యాక్షన్‌ పాత్రలు బోర్‌ కొట్టడంతో త్రివిక్రమ్‌ కొత్త కథ చెప్పిన వెంటనే ఎన్టీఆర్‌ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్‌ సినిమా పూర్తి కాకుండానే త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేయబోతున్నాడు. త్రివిక్రమ్‌ సలహా మేరకు ఎన్టీఆర్‌ లుక్‌ మార్చనున్నట్లుగా తెలుస్తోంది. 

ఎన్టీఆర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు, కొన్ని కొత్త యాక్షన్‌ టెక్నిక్స్‌ను కూడా నేర్చుకునేందుకు విదేశాలకు ఎన్టీఆర్‌ వెళ్లబోతున్నాడు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం జైలవకుశ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఆ సినిమా ఫీవర్‌ నుండి బయటకు వచ్చేందుకు మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. అప్పుడు ఫ్యామిలీతో విదేశాల్లో టూర్‌కు వెళ్లి, అక్కడ కొన్నాళ్లు ఎంజాయ్‌ చేసి, ఆ తర్వాత త్రివిక్రమ్‌ సినిమా కోసం రెడీ అవ్వబోతున్నాడు.