నాగార్జున కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌..!

నాగార్జున కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌..!
Cinema News

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ సినిమాలో నటిస్తున్నాడని అందరికి తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున 99వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది . త్వరలోనే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేందుకు రెడీ అవుతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. కాగా ఇదిలా ఉంటే నాగార్జున తమిళ దర్శకుడు అనిల్‌తో ఒక సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. జ్ఞానవేళ్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

నాగార్జున కొత్త సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌..!
Nagarjuna

తాజాగా ఈ సినిమా కి టైటిల్‌ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ టాక్‌ ప్రకారం ఈ సినిమా కి Love Action Romance టైటిల్‌ పెట్టారంట ఈ క్రేజీ సినిమా లో నాగ్‌ పక్కా యాక్షన్‌ ప్యాక్‌డ్‌ అవతార్‌లో కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. స్టూడియో గ్రీన్ నిర్మించనున్న ఈ సినిమా లో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారంట . మొత్తానికి కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సర్‌ప్రైజ్‌ గెటప్స్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడని తాజా అప్‌డేట్‌తో అర్థమవుతుంది .