నానికి తీవ్ర అన్యాయం… ఇది సరైనది కాదు

Nani MCA Movie Postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యువ హీరో నాని ఇటీవల వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు విజయాలు దక్కించుకున్న నాని ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రంతో మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. క్రిస్మస్‌కు ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. దిల్‌రాజు స్వయంగా క్రిస్మస్‌కు చిత్రాన్ని విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు. కాని తాజాగా వారం రోజుల ముందే విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అఖిల్‌, అల్లు శిరీష్‌ల చిత్రాలు క్రిస్మస్‌కు విడుదల కాబోతున్న నేపథ్యంలో నాని సినిమాను ముందే విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు భావించాడు. కాని తాజాగా అలా కూడా కాకుండా జనవరిలో సినిమాను విడుదల చేయాలని దిల్‌రాజు నిర్ణయించాడు.

అక్కినేని మరియు అల్లు వారి నుండి ఒత్తిడి రావడంతో దిల్‌రాజు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి పవన్‌ మరియు బాలయ్యలు రాబోతున్నారు. వారు వచ్చిన వారం పది రోజులకు నాని ‘ఎంసీఏ’ విడుదల చేయాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ‘భాగమతి’ అదే సమయంకు విడుదల ఉన్న నేపథ్యంలో నాని సినిమాకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాని సినిమాను కావాలని పక్కకు తోస్తున్నారని, క్రిస్మస్‌కు విడుదల అయితే నానికి మంచి కలెక్షన్స్‌ రావడంతో పాటు, భారీ విజయాన్ని దక్కించుకుంటుందని నాని అభిమానులు అంటున్నారు. జనవరిలో సినిమాను విడుదల చేస్తే నానికి అన్యాయం జరిగినట్లే అంటూ కొందరు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.