నానిని వెతుక్కుంటూ వస్తున్నారు

nani-mext-movie-with-vikram-k-kumar

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుసగా ఏడు సినిమాలు సక్సెస్‌లు అవ్వడంతో నాని స్థాయి అమాంతం పెరగింది. ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరో, మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా నాని నిలిచాడు. వరుస విజయాలతో పాటు చాలా స్పీడ్‌గా కూడా సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒకటి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, రెండవది వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో మూడు నాలుగు సినిమాలను నాని లైన్‌లో ఉంచాడు. నానికి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం ఆసక్తిని కనబర్చుతున్నారు.

తమిళం మరియు తెలుగులో మోస్ట్‌ క్రేజీ దర్శకుడు అయిన మణిరత్నం దర్శకత్వంలో నాని ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. త్వరలో ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా తర్వాత తమిళ దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ ‘మనం’తో పాటు పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించి ప్రస్తుతం అఖిల్‌ రెండవ సినిమా ‘హలో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌తో చేస్తున్న ‘హలో’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింతగా ఉన్నాయి.

‘హలో’ పూర్తి అవ్వగానే నానితో తెలుగు మరియు తమిళంలో ఒక సినిమాను తెరకెక్కించేందుకు విక్రమ్‌ కుమార్‌ కథను సిద్దం చేయడం జరిగింది. విభిన్న కథలపై ఆసక్తికని కనబర్చే నాని వెంటనే విక్రమ్‌ కథకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు, మణిరత్నం సినిమా తర్వాత విక్రమ్‌ దర్శకత్వంలో నాని సినిమా ఉండవచ్చు. వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో నాని, విక్రమ్‌ కుమార్‌ల సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు, మణిరత్నం మరియు విక్రమ్‌ కుమార్‌ల దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు సక్సెస్‌ అయితే నాని కెరీర్‌ మరింతగా పీక్స్‌కు వెళ్లడం ఖాయం