నాని పారితోషికం దారుణం

Nani Renovation Increase In After Ninnu Kori Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Nani Renovation Increase In After Ninnu Kori Movie

టాలీవుడ్‌లో హీరోలు అంతా కూడా ప్రస్తుతం నానిని చూసి కుళ్లుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. వరుసగా ఏ హీరోకు రాన్నన్ని సక్సెస్‌లు నాని దక్కించుకున్నాడు. అప్పట్లో చిరంజీవికి మాత్రమే సాధ్యం అయిన రికార్డును, ఇప్పుడు ఏ హీరో కూడా సాధించలేని రికార్డును నాని సాధించాడు. వరుసగా ఏడు సినిమాలు సక్సెస్‌ కావడంతో నాని రేంజ్‌ అమాంతం పెరిగి పోయింది. మొన్నటి వరకు రెండు మూడు కోట్లు ఉన్న పారితోషికం ఇప్పుడు అమాంతం 8 కోట్లు అయ్యింది. ఇది నాని పెంచిన పారితోషికం కాదు. ఆయన రేంజ్‌ పెరగడంతో నిర్మాతలు ఇస్తామంటున్న పారితోషికం.

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలుగా చెప్పుకుంటున్న వారిలో ఒక అయిదు లేదా ఆరుగురు మాత్రమే పది కోట్లు అంతకు మించి పారితోషికం తీసుకుంటున్నారు. మిగిలిన హీరోలు అంతా కూడా అయిదు నుండి ఎనిమిది కోట్లు తీసుకుంటున్న వారే. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మెగా హీరోలు సాయిధరమ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌లు కూడా నాని స్థాయిలో పారితోషికం తీసుకోవడం లేదు. ఈ విషయం చాలు ప్రస్తుతం నాని స్థాయి ఏ రేంజ్‌లో ఉందో చెప్పుకోవడానికి. నాని కథల ఎంపిక విషయంతో పాటు, దర్శకుల ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే ఇలా సక్సెస్‌లు వస్తున్నాయి. మరో సంవత్సరంలో నాని 10 కోట్ల హీరో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 మరిన్ని వార్తలు :

ఎన్టీఆర్‌, పూరిలు ఎలా కాంప్రమైజ్‌ అయ్యారో తెలుసా?

బోయపాటి మార్క్‌ ఏది?