ఎన్టీఆర్‌ మళ్లీ వస్తున్నాడు

jai lava kusa movie second character lavakumar teaser release on this month ending

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ తాజాగా జై టీజర్‌తో సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. కొద్ది గంటల్లోనే కోటి వ్యూస్‌ను దక్కించుకుని సౌత్‌లో ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్‌ రాబట్టని వ్యూస్‌ను రాబట్టింది. ఆ వ్యూస్‌ను చూస్తుంటే ఎన్టీఆర్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రంపై ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జై టీజర్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్‌ను వదిలేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు రెడీ అయ్యారు. 

జై టీజర్‌లో ఎన్టీఆర్‌ విలనిజంతో కనిపించాడు. ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. అందులో ఒక పాత్ర జై కాగా, ఆ పాత్ర విలన్‌ అని తేలిపోయింది. ఇక మిగిలిన రెండు పాత్రలు ఏంటి, ఆ పాత్రల్లో ఎన్టీఆర్‌ ఎలా ఉంటాడు అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల చివర్లో రెండవ పాత్ర అయిన లవకుమార్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌ ఎడిట్‌ అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రెండవ టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలు పెరగడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. మూడు విభిన్న పాత్రలకు మూడు టీజర్‌లను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు గతంలోనే ప్రకటించిన విషయం తెల్సిందే. చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నారు.

మరిన్ని వార్తలు