పవన్‌కు చెల్లి అవ్వమంటే నో చెప్పింది

niveda-thomas-rejects-pawan-kalyan-new-movie-offer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Niveda Thomas Rejects Pawan Kalyan New Movie Offer

నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మన్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి మెప్పించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నివేదా థామస్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవలే ‘నిన్ను కోరి’ చిత్రంతో మరోసారి నానితో కలిసి సక్సెస్‌ను దక్కించుకున్న ఈమె ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాలతో పాటు ఈమె ఖాతాలో ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి. అయితే పవన్‌ కళ్యాణ్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం ఈమె నో చెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాలో పవన్‌కు చెల్లి పాత్ర ఉందట. ఆ పాత్రను చేసేందుకు నివేదా థామస్‌ను త్రివిక్రమ్‌ అండ్‌ టీం సంప్రదించడం జరిగింది. అయితే ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస అవకాశాలు వస్తున్న సమయంలో అలాంటి పాత్రలు చేయడం కెరీర్‌కు ఇబ్బందులు తెచ్చి పెడుతుందనే ఉద్దేశ్యంతో నివేదా ఆ పాత్రను అయిష్టంగానే వదులుకుందట. తాజాగా ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా నివేదా థామస్‌ మాట్లాడుతూ పవన్‌తో సినిమా వదులుకున్నందుకు బాధగా ఉందని, మరోసారి ఆయనతో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లుగా నివేదా పేర్కొంది.

 మరిన్ని వార్తలు :

ఎన్టీఆర్‌ మళ్లీ వస్తున్నాడు

నాని పారితోషికం దారుణం