‘ఫిదా’కు భారంగా మారిన దిల్‌రాజు వ్యాఖ్యలు

dil raju said i didn't understand the fidaa movie climax

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు క్లాస్‌ చిత్రాలను తెరకెక్కించిన శేఖర్‌ కమ్ముల మొదటి సారి తన మార్క్‌కు పూర్తి వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని చేయడం జరిగింది. వరుణ్‌ తేజ్‌ లుక్‌ మరియు హీరోయిన్‌గా సాయిపల్లవి నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్‌ మరియు ట్రైలర్‌తో సినిమా బాగుంటుందనే అభిప్రాయానికి మెగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన ఆడియో వేడుకలో దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు సినిమాకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి. 

ఆడియో వేడుకలో దిల్‌రాజు మాట్లాడుతూ.. ఫిదా మూవీ క్లైమాక్స్‌ తనకు ఇంత వరకు అర్థం కాలేదు అని చెప్పుకొచ్చాడు. అయితే దిల్‌రాజు ఆ వ్యాఖ్యలు చేసింది ఒక ఉద్దేశ్యంతో అయితే సోషల్‌ మీడియాలో మరో ఉద్దేశ్యంతో ప్రచారం జరుగుతుంది. దిల్‌రాజుకు క్లైమాక్స్‌ నచ్చలేదు, దానికి తోడు పలు చెత్త సీన్స్‌ ఉండటం వల్ల కొన్ని అయినా మార్చాలనే ఉద్దేశ్యంతో చివరి నిమిషంలో రీ షూట్‌ చేయించాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దాంతో మెగా ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అనేది అనుమానంగా ఉంది. ఏదైనా సినిమాకు దిల్‌రాజు వ్యాఖ్యలు కామెంట్స్‌ బలాన్ని ఇస్తాయి. కాని ఈసారి మాత్రం దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ‘ఫిదా’ పాలిట శాపంగా మారాయి.

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌, పూరిలు ఎలా కాంప్రమైజ్‌ అయ్యారో తెలుసా?

ఆడ నిర్మాతలు బెడ్ రూమ్ కి రమ్మంటున్నారు.