బోయపాటి మార్క్‌ ఏది?

Boyapati Directing A Class Movie With Bellamkonda Sreenivas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Boyapati Directing A Class Movie With Bellamkonda Sreenivas

‘లెజెండ్‌’, ‘సరైనోడు’ వంటి మాస్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకున్న బోయపాటి శ్రీను తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. బోయపాటి శ్రీను సినిమాలు అనగానే ప్రేక్షకులు భారీ మాస్‌ యాక్షన్‌ సీన్స్‌ను ఊహించుకుంటారు. ఈయన గత చిత్రాలు అలాగే ఉంటాయి. అంతటి మాస్‌ సినిమా దర్శకుడు అయిన బోయపాటి ఇప్పుడు ఒక క్లాస్‌ టచ్‌ ఉన్న సినిమాను చేయడం ఆయన అభిమానులకు పెద్దగా నచ్చడం లేదు. టైటిల్‌ ప్రకటించినప్పటి నుండి కూడా సినిమాపై విమర్శలు పెరుగుతున్నాయి. 

టైటిల్‌ చాలా సాఫ్ట్‌గా ఉండటంతో ఇదో క్లాస్‌ సినిమా అని అంతా భావించారు. ఆ తర్వాత ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో హీరోయిన్‌ కూల్‌ లుక్‌తో ఇదో సింపుల్‌ క్లాస్‌ లవ్‌ స్టోరీ అనుకున్నారు. అయితే బెల్లంకొండది ఒక మాస్‌ స్టిల్‌ను విడుదల చేయడంతో ఇందులో మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని కాస్త సంతోషింకారు. అయితే తాజాగా విడుదలైన టీజర్‌ బోయపాటి అభిమానులను నిరాశ పర్చుతున్నాయి. టీజర్‌లోనే బోయపాటి మార్క్‌ కనపడటం లేదు. ఇక సినిమాలో బోయపాటి మాస్‌ ఉంటుందా అని కొందరు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఇది క్లాస్‌ సినిమానా, మాస్‌ సినిమానా అర్థం కాకుండా ఉంది. తాజాగా విడుదలైన టీజర్‌తో మాస్‌ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. ట్రైలర్‌లో ఏమైనా దుమ్ము లేపుతాడేమో చూడాలి.

 మరిన్ని వార్తలు :