స్పందించిన వెంకటేష్‌ ఫ్యామిలీ

akhil and venkatesh daughter marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో నాగార్జున కొడుకు అఖిల్‌కు, వెంకటేష్‌ కూతురుతో వివాహం జరిపేందుకు నిర్ణయించుకున్నారని, నాగార్జున వెంకటేష్‌లు వియ్యంకులు అవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతున్న ఈ వార్తకు ఇటు అక్కినేని కుటుంబ సభ్యులు అటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇప్పటి వరకు వెంకటేష్‌ కూతురు పెళ్లి గురించి ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది అఖిల్‌కు ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లుగా ప్రచారం ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

ఆయన మాట్లాడుతూ.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల మద్య సన్నిహిత సంబంధాలు ఉన్న మాట వాస్తవమే. అయితే నాగార్జున, వెంకటేష్‌లు వియ్యంకులు కాబోతున్నారు అన్న వార్తలో నిజం లేదని, ఇది ఎవరో కావాలని పుట్టించిన వార్త అని చెప్పుకొచ్చాడు. వెంకీ కూతురు ప్రస్తుతం చదువు కోసం విదేశాల్లో ఉందని, ఆమె పెళ్లి గురించి ఇప్పటి వరకు మా కుటుంబంలో ఏ ఒక్కరు ఆలోచించలేదు అని, అలాగే అఖిల్‌కు ఇవ్వాల్సింది అక్కినేని కుటుంబం నుండి కూడా ఎలాంటి ప్రపోజల్‌ రాలేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఇక అక్కినేని కుటుంబ సభ్యుల నుండి ఒక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు 

తాప్సి బలుపు వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి

ఆ 10 మంది పద్దతి మార్చుకోవాలి

‘లై’ వర్కౌట్‌ అయ్యేలా ఉంది