తేజస్వి, అనీష ఆంబ్రోస్‌ స్వలింగ సంపర్కులా?

Tejaswi And Anisha Ambrose in Swimming Pool

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Tejaswi And Anisha Ambrose Swimming Pool Photo Viral On Social Media

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌ కావడం చాలా అరుదు. ఒక వేళ హీరోయిన్‌ అయినా కూడా రెండు మూడు సినిమాలతోనే సరి పెట్టుకోవాల్సి ఉంటుంది. తెలుగులో తెలుగు అమ్మాయిలు రాణించడం చాలా అరుదు. ప్రస్తుతం తేజస్వి మరియు అనీషా ఆంబ్రోస్‌లు హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. వీరిద్దరు తెలుగు అమ్మాయిలు అయినా కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా గ్లామర్‌ను ఒలకబోస్తూ ఉన్నారు. తాజాగా వీరిద్దరు ఒక స్విమ్మింగ్‌ పూల్‌లో చాలా క్లోజ్‌గా ఉన్న ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో తెగ సందడి చేసే తేజస్వి ఆ ఫొటోను పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌కు వింత వింత కామెంట్లు వచ్చాయి. ఇద్దరు అమ్మాయిలు, అది కూడా తెలుగు అమ్మాయిలు అలా ఉండటంతో సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ దుమ్ము దులిపేశారు. ఓ రేంజ్‌లో ఏకి పారేశారు. వివరాల్లోకి వెళ్తే… ఆ ఫొటోకు ఒక వ్యక్తి మీరేమైనా స్వలింగ సంపర్కులా అంత క్లోజ్‌గా ఉన్నారు అంటూ కామెంట్‌ చేశాడు. మరో వ్యక్తి మీలో అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ విసిరాడు. ఇలా ఎంతో మంది వీరి ఫొటోకు కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే తేజస్వి మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పనేంటో తాను చూసుకుంటుంది. అయితే ఇకపై అయినా అలాంటి ఫొటోలు తేజస్వి పెట్టకుండా ఉంటుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు: