ఫిష్‌ వెంకట్‌ రియల్‌ విలన్‌ వేషాలు

Police-Files-Case-On-Tollyw

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Police Files Case On Tollywood Villan Fish Venkat And Family Members

చాలా సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు కమెడియన్‌గా, విలన్‌గా సుపరిచితుడు ఫిష్‌ వెంకట్‌. కెరీర్‌ ఆరంభంలో విలన్‌ వేషాలు వేసిన ఫిష్‌ వెంకట్‌ ఇప్పుడు మాత్రం ఎక్కువ కామెడీ రోల్స్‌ చేస్తున్నాడు. విలన్స్‌ పక్కనే ఉండి కామెడీ చేయడంలో ఫిష్‌ వెంకట్‌ తర్వాతే మరెవ్వరైనా అనే విషయం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫిష్‌ వెంకట్‌ ఒక వివాదాస్పద అంశంతో మీడియా ముందుకు వచ్చాడు. తానో సెలబ్రెటీని అంటూ ఒక ఫ్యామిలీపై దాడి చేయబోయి పోలీసు కేసులో ఇరుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. వెంకట్‌ కూతురు భద్రాద్రి జిల్లా కొత్త గూడెంలో ఉంటుంది. అక్కడ ఇంటి పక్కన వారితో ఏవో వివాదాలు ఆమెకు ఉన్నాయి. చాలా రోజులుగా ఆ వివాదాలు కొనసాగుతూ వస్తున్నాయట. తాజాగా వెంకట్‌ కొత్తగూడెం వెళ్లాడు. ఆ సమయంలోనే పక్కింటి వారి గురించి ఆయన కూతురు చెప్పడం, కాస్త మద్యం పుచ్చుకుని ఉన్న ఫిష్‌ వెంకట్‌ పక్కింటి వారిపైకి గొడవకు వెళ్లాడు. వారిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడంతో పాటు, ఆ ఇంటి ఓనర్‌ను కూడా కొట్టే ప్రయత్నం చేశాడు. దాంతో వారు పొద్దున్నే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. వెంకట్‌తో పాటు ఆయన కూతురు మరియు ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. అత్యుత్సాహంతో రియల్‌ విలనిజంను చూపించబోయిన వెంకట్‌ కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరిన్ని వార్తలు:

తాప్సి బలుపు వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి

ఆ 10 మంది పద్దతి మార్చుకోవాలి