శమంతకమణి ప్రివ్యూ.

samanthakamani Telugu Movie Preview and Rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బ్యానర్ : భవ్య క్రియేషన్స్
నటీనటులు : ఆది, నారా రోహిత్ ,సుదీర్ బాబు , సందీప్ కిషన్ తదితరులు
నిర్మాత : వి.ఆనంద్
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
స్క్రీన్ ప్లే : వెంకి
మ్యూజిక్ డైరెక్టర్ : మణి శర్మ
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

“శమంతకమణి”… తెలుగులో నలుగురు హీరోలు కలిసి నటిస్తున్న సినిమా. ఆషామాషీగా సినిమాలు ఒప్పుకోని నారా రోహిత్ తో పాటు ఆచితూచి అడుగులు వేస్తున్న సందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు కలిసి తెలిసి చేస్తున్న సినిమా కావడంతో శమంతకమణి మీద ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఈ కధలో కొత్తదనం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ నలుగురిలో ఒకరైన సుధీర్ బాబు తో కలిసి 2015 లో ” భలే మంచి రోజు” సినిమాతో దర్శకుడు గా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. కొత్త కోణంలో ఆలోచించే శ్రీరామ్ ఆదిత్య టాలెంట్ ని తొలి సినిమానే రుజువు చేసింది. రెండేళ్ల తర్వాత ఆదిత్య చేస్తున్న శమంతకమణి ఓ కారు చుట్టూ తిరిగే కథ.

ఇక నిర్మాతలుగా వ్యవహరిస్తున్న భవ్య క్రియేషన్స్ సంస్థ సంగతి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బాలయ్య, పూరి కాంబినేషన్ లో పైసా వసూల్ చేస్తున్న భవ్యాస్ ఆనంద్ ప్రసాద్ పూర్తిగా కథ, కధనాన్ని నమ్మి చేస్తున్న సినిమా శమంతకమణి. అందుకే నలుగురు హీరోలతో బడ్జెట్ పెరిగినా అదే విశ్వాసంతో ముందుకెళ్లి తీసిన సినిమా. ఈ శమంతకమణి కూడా విజయవంతమైతే తెలుగులో మరిన్ని కొత్త తరహా సినిమాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

మరిన్నివార్తలు 

 స్పందించిన వెంకటేష్‌ ఫ్యామిలీ

ఫిష్‌ వెంకట్‌ రియల్‌ విలన్‌ వేషాలు

బిగ్‌ బాస్‌ షోపై కేసు నమోదు