బాలయ్యకు అస్వస్థత

Bala Krishna in hospital due to Food Poison

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

నందమూరి బాలకృష్ణ అనారోగ్యం పాలయ్యారు. నిన్న ‘శమంతక మణి’ చిత్ర ఆడియో వేడుకలో పాల్గొనాల్సి ఉండగా ఫుట్‌ పాయిజన్‌ కారణంగా పాల్గొనలేక పోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత ఆనందప్రసాద్‌ మీడియాతో చెప్పుకొచ్చారు. తమిళనాడులోని కుంభకోణంలో షూటింగ్‌లో మొన్నటి వరకు పాల్గొన్న బాలయ్య తాజాగా హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడే బోజనం చేశాడని, ఆ బోజనం కాస్త వికటించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

బాలయ్య హాజరు కాక పోవడంతో ‘శమంతకమణి’ ఆడియోను దర్శకుడు పూరి జగన్నాధ్‌ ఆవిష్కరించారు. బాలయ్య ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఆనందప్రసాద్‌ నిర్మాణంలో ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాకుండానే తమిళ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ‘జయసింహా’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. భారీ స్థాయిలో ఈ రెండు సినిమాలపై ఫ్యాన్స్‌ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకటి దసరాకు రాబోతుండగా, మరోటి సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఈ రెండు సినిమాల విడుదలలో ఏమైనా మార్పు ఉంటుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు