తలారి పోస్టుతో మాచెడ్డ తంటా

talari post vacancy not filling in tihar jail

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పేరుకు దక్షిణాసియాలోనే పేరున్న పెద్ద జైలు. కానీ ఉరిశిక్ష వేస్తే అమలు చేయడానికి తలారి మాత్రం లేడు. ఇదీ తీహార్ జైలు చిత్రం. అదేమంటే అక్కడ రికార్డులు కూడా అలాగే ఉన్నాయంటున్నారు అధికారులు. ఎప్పుడో 1950లో తీహార్ జైలు నిర్మించగా.. ఇంతవరకు రికార్డుల్లో అక్కడ పనిచేసిన తలారుల వివరాల్లేవు.

తలారి పని చేయడానికి స్థానికులు రెడీగానే ఉన్నా.. జైలు సిబ్బంది మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నారు. గతంలో ఇందిరాగాంధీని చంపిన హంతకుల్ని ఉరితీయడానికి మీరట్ జైలు నుంచి తలారిని తీసుకొచ్చారు. ఈసారి కూడా అలాగే చేయొచ్చని.. ఎప్పుడోసారి పనిపడే తలారి పోస్ట్ భర్తీ చేయడం డబ్బులు దండగని మరీ కొందరు పై అధికారులకు చెబుతున్నారట. దీంతో నవ్వాలో, ఏడవాలో ఎవరికీ తెలియడం లేదు.

అఫ్జల్ గురుకు తీహార్ జైల్లోనే ఉరి పడింది. కానీ ఉరి తీసింది ఎవరో ఇంతవరకూ బయటకు రాలేదు. అంతకుముందు 1989 నుంచి 2013 వరకు ఇక్కడ ఎవరికీ ఉరిశిక్ష వేయలేదు. దాంతో తలారి అవసరం రాలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ రేప్ నిందితులకు ఉరే సరి అని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఇప్పుడైనా తలారిని రిక్రూట్ చేస్తారా.. మళ్లీ పక్క జైలు నుంచి పిలిపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు