గ్రేట్ వర్క్… రంగస్థలం మీద లోకేష్ ప్రశంసల జల్లు

Nara Lokesh praises Rangasthalam Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం “రంగస్థలం”. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. చిట్టిబాబు అనే చెవిటివాడి పాత్రలో నటించిన రాం చరణ్ తన నటనతో అందరిని మెప్పిస్తున్నాడు. గత నెలలో విడుదలైన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. 1985 గ్రామీణ నేపథ్య కథాంశంతో తెరకెక్కిన రంగస్థలం అప్పటి గ్రామాలను… సామజిక పరిస్థితులను కళ్ళకు అద్దినట్లు గా చూపించింది. ఈ సినిమాలో నటించిన మెయిన్ లీడ్ లకే కాకుండా ప్రతి ఒక్క నటీనటులకు మంచి పేరువచ్చింది.

తాజాగా రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ చిత్రాన్ని తిలకించారు. సినిమా చూసిన అనంతరం చరణ్, సుకుమార్ ల మీద లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంత మంచి సినిమాను ఇచ్చిన రామ్ చరణ్, సుకుమార్ అండ్ టీం చాలా గ్రేట్… సినిమా చూసిన తర్వాత కూడా ఆ సినిమాలోని క్యారెక్టర్స్ మనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు అని పొగడ్తల వర్షం కురిపించాడు. నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 Nara Lokesh praises Rangasthalam Movie