ఆ రోజు చాంబర్ లో పవన్ ఏం చేశాడో బయటపెట్ట్టిన నట్టి కుమార్ !

Natti Kumar Says what did Pawan Kalyan in MAA film Chamber

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీ రెడ్డి తనని అసభ్యంగా తిడితే తిట్టిన మూడు రోజులకి బయటకి వచ్చిన పవన్ ఆమె తన తల్లిని దూషించింది అని పేర్కొంటూ ఫిలింఛాంబర్ వద్దకు రావటం… ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్న విజుయల్స్ బయటకి రావడం తెలిసిన సంగతే, అయితే ఫిలిం చాంబర్ వద్దకి పవన్ వచ్చాడన్న సంగతి తెలుసుకున్న ఆయన అభిమానులు చాంబర్ వద్దకు చేరుకున్నారు. అదే సమయానికి మెగా కుటుంబం నుండి అల్లు అర్జున్, నాగబాబు, బయట నుండి శివాజీ రాజా, హేమ, నరేష్ , పరచూరి వెంకటేశ్వరరావు వంటి వారు కొంతమంది రావడంతో ఆసమయంలో అక్కడ అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో కేవలం పవన్ వ్యవహారం మీదనే మీడియా ఫోకస్ చేసింది. ఒకదశలో ఛాంబర్ రూంలోకి వెళ్లి పవన్ తలుపులు వేసుకున్నారని.. దీక్ష చేస్తున్నట్లుగా కొన్ని ఛానల్స్ లో స్క్రోలింగ్స్ పడ్డాయి. అయితే ఈ అంశం మీద పవన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారంటూ ప్రచారం జరిగినా.. ఏమీ మాట్లాడకుండానే పవన్ వెళ్లిపోయారు.

ఆరోజు అసలు ఫిలింఛాంబర్ కు పవన్ ఎందుకు వచ్చారు? ఏం చేశారు? అసలు ఫిలింఛాంబర్లో ఏం జరిగింది? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ మాదిరి తయారైంది. తాజాగా ఆ రోజు ఏం జరిగిందన్నది బయటపెట్టారు నిర్మాత నట్టికుమార్. ఫిలింఛాంబర్ వద్దకు పవన్ కల్యాణ్ వచ్చిన కాసేపటికి తనను కూడా రమ్మని కబురు పెట్టారని.. ఆ టైంలోతాను అర్జెంట్ పని మీద గోవా వెళుతున్నానని.. అందుకే రానని చెప్పానని నట్టి తెలిపారు. ఫిలిం ఛాంబర్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన మీటింగ్ కు ఛాంబర్ నుండి క్యాషియర్, సెక్టార్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు వెళ్ళారని అయితే ఈ మీటింగ్ మీది కాదు మాది అంటూ వారందరిని బయటకు పంపేశారన్నారు. ఈ మీటింగ్ మాది అంటే ఏంటి ఈ ఇండస్ట్రీ మీ సొంతమా ? మీ 20 20 మందే ఇండస్ట్రీ కాదు కదా? అని నట్టి ప్రశ్నించారు. ఇండస్ట్రీ అంటే లక్షల మంది ఉన్నారని నట్టి కుమార్ అన్నారు.

శ్రీరెడ్డి విషయంలో ఛాంబర్ వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, జరిగిన దాంట్లో ఛాంబర్ తప్పు ఉంది కాబట్టే వారు మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. శ్రీరెడ్డి చేత పవన్ ను తిట్టించిన వారిలో చాంబర్ లోని ఓ వర్గం ఉందని నట్టి ఆరోపించారు. అలాగే తాను కాపునే అయినా.. ఆ వర్గానికి చెందిన వాడిగా తాను మాట్లాడటం లేదని.. ఆ మాటకు వస్తే సినిమా ఇండస్ట్రీకి కులం లేదన్నారు. 2009లో ఇదే రీతిలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చిరంజీవి కాపు అని పబ్లిసిటీ చేసి మిగిలిన వారికి దూరం చేశారన్నారు. ఇప్పుడు పవన్ విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. అందుకే.. పవన్ మొదట్నించి క్లారిటీగా చెబుతున్నారని తాను ఏ ఒక్క కులానికి చెందిన వాడిని కానన్న విషయాన్ని పవన్ స్పష్టం చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు.

శ్రీరెడ్డి ఇష్యూలో మా సభ్యులు తప్పులు చేశారని.. అందుకు అసోసియేషన్ బాడీ మొత్తం రాజీనామాలు చేయాలన్నారు. ఆ అమ్మాయి మీద బ్యాన్ ఎందుకు విధించారు? ఎందుకు ఎత్తివేశారు? అని ప్రశ్నించారు. ఇక.. ఫిలింఛాంబర్ దగ్గరకు వచ్చిన పవన్ వచ్చినప్పుడు జరిగిన విషయాల్ని వెల్లడిస్తూ.. తన తల్లిని తిట్టించారన్న మాటతో పాటు.. ఛాంబర్ ఏం చేస్తోంది? అని నిలదీసినట్లుగా చెప్పారు. ఈ ఇష్యూ మీద డీజీపీకి ఫిర్యాదు ఎందుకు ఇవ్వలేదన్న క్వశ్చన్ ను సంధించినట్లు చెబుతున్నారు. అసలు ఇష్యూ ఎక్కడిది? నా మీదకు ఎందుకు వచ్చింది? అని ఆయన అడిగినట్లు చెప్పారు. తనకుసంబంధం లేని విషయం తన మీదకు తేవటం.. తన తల్లిని తిట్టించటం పట్ల తీవ్ర అసహనాన్ని.. అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా చెప్పారు. అలాగే తానూ పవన్ పార్టీ లో లేనని ఇప్పటికీ కాంగ్రెస్తోనే ఉన్నానని స్పష్టం చేశారు ఆయన.