త్వరలో నరసింహనాయుడు సీక్వెల్.

narasimha nayudu movie sequel coming soon

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2001 సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు బాక్సాఫీస్ వద్ద నేరుగా తలపడ్డారు. మృగరాజుతో చిరంజీవి, నరసింహనాయుడుతో బాలయ్య, దేవీపుత్రుడుతో వెంకటేష్ ఢీకొడితే ఆ ఏడాది నరసింహనాయుడు సంక్రాంతి విజేతగా నిలవడమే కాదు ఇటు బాలయ్య కెరీర్ లోనే కాకుండా అటు తెలుగు చలన చిత్ర రంగంలోనూ ఎన్నో రికార్డులు నమోదు చేసింది. బాలయ్య కెరీర్ ని ఇంకో ఎత్తుకు తీసుకెళ్లిన ఈ సినిమా విషయంలో కథ అందించిన చిన్నికృష్ణ పాత్ర ఎంతో వుంది.

balakrishna

బాలకృష్ణ, చిన్నికృష్ణ జీవితాల్లో తీపి గుర్తుగా మిగిలిన నరసింహనాయుడు సినిమా సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా దర్శకనిర్మాతలు ఎవరన్నది తేలకపోయినా కథ మాత్రం ఫైనల్ స్టేజి లో ఉన్నట్టు తెలుస్తోంది. నరసింహనాయుడు సీక్వెల్ చేయాలన్న తలంపుతో రచయిత చిన్నికృష్ణ దీనిపై సీరియస్ గా కూర్చుని ఓ సూపర్ కథ రాసుకున్నారట. దీనికి తుది మెరుగులు దిద్దే పనిలో వున్న చిన్నికృష్ణ త్వరలో బాలయ్యకు కథ చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ కథ బాలయ్యను మెప్పిస్తే నరసింహనాయుడు సీక్వెల్ త్వరలో పట్టాలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ కధకు అప్పటి దర్శకుడు బి.గోపాల్ ని రంగంలోకి దించుతారా లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి వుంది.