ఎన్టీఆర్, త్రివిక్రమ్ అయినా ఆ టెస్ట్ పాస్ అవుతారా ?

NTR And Trivikram Will Continue Photographer In Next Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో ఏ భారీ ప్రాజెక్ట్ లేదా సెన్సేషనల్ ప్రాజెక్ట్ గురించి అనుకున్నా ముందుగా భారతీయ సినీ ఇండస్ట్రీ లో దిగ్గజాలు అనుకున్న పేర్లు వినిపించడం తీరా సినిమా వచ్చేసరికి వాళ్ళు అందులో భాగం కాలేకపోవడం చూస్తూనే వున్నాం. ఈ విషయంలో మిగిలిన టెక్నికల్ విషయాల కన్నా ఫోటోగ్రఫీ విభాగంలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. భారత దేశం గొప్పగా చెప్పుకునే ఫోటోగ్రాఫర్స్ తెలుగు సినిమాలకు పనిచేస్తుంది చాలా తక్కువ . ముందుగా వారి పేరు ప్రకటించడం వరకు బాగానే ఉంటుంది. తర్వాత షూటింగ్ మొదలు అయ్యే లోపు లేదా మొదలైన కొద్దిరోజులకు దర్శకుడు, హీరో, నిర్మాత ఇలా ఎవరో ఒకరితో పొసగక ఫోటోగ్రాఫర్ ని మార్చడం చాలా సార్లు చూస్తున్నాం.
ntr-and-trivikram
ఇటీవల కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం మీద ఎన్టీఆర్ హీరోగా చేసిన జై లవకుశ విషయంలోనూ ఇలాగే జరిగింది. త్రి ఇడియట్స్, పీకే వంటి చిత్రాలకు పనిచేసిన మురళీధరన్ ని ఈ సినిమాకు ముందుగా ఫోటోగ్రఫీ కోసం అనుకున్నారు. తీరా షూటింగ్ మొదలు అయ్యాక దర్శకుడుతో విభేదాలు అన్న మాట వినిపించింది. అందులో నిజం ఉందోలేదో గానీ సినిమా నుంచి మురళీధరన్ వెళ్ళిపోయి చోటా కె నాయుడు సీన్ లోకి వచ్చారు. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి హీరోగా స్టార్ట్ అవ్వబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమా కోసం రవివర్మన్ ఫోటోగ్రఫీ చేస్తాడు అని అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఇంకోరు వస్తారు అన్న టాక్ వుంది. ఈ రెండు రీసెంట్ ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ఇంతకుముందు చాలా జరిగాయి.
trivikram
ఇన్ని అనుభవాలు చూసినప్పటికీ ఎ0 ఆ ప్రముఖ ఫోటోగ్రాఫర్ కూడా ఈ కాంబినేషన్ లో వర్క్ చేయడానికి బాగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి అయినా ఆ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమాకు పూర్తి అయ్యే దాకా పని చేస్తారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే సినిమా క్వాలిటీ కోసం తపించే ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఈ విషయంలో పరీక్ష తప్పదు . ఈ ఫోటోగ్రాఫర్ టెస్ట్ లో వాళ్ళు  సక్సెస్ అవుతారని ఆశిద్దాం.