ఎత్తిన జెండా దించకుండా, తెలుగుదేశం పార్టీకి కాపలాకాసిన ప్రతీ కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు. కడపలో మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు.