సినిమా హాళ్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మంత్రి కందుల దుర్గేష్ వివరాలు అందజేశారు. ఈ క్రమంలో సినిమా థియేటర్‌లు, సినీపరిశ్రమలో సమస్యలపై పవన్ కళ్యాణ్ మీడియా ప్రకటన విడుదల చేశారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని తెలిపారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశించారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని అన్నారు.