కొరియా భాష లో చంద్రబాబు…

Chandrababu naidu use Korean language at South Korea tour

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఎదుర్కొనే విషయాల్లో ఒకటి ఇంగ్లీష్ లో మాట్లాడ్డం. ఒక్క ఇంగ్లీష్ మాత్రమే కాదు హిందీలో కూడా బాబు వీక్ నెస్ ని జగన్ లాంటి వాళ్ళు ఎద్దేవా చేస్తుంటారు. అయితే వయసు మీద పడ్డప్పటికీ ఆ రెండు భాషల్లో పట్టుకోసం ఇప్పటికీ ట్రై చేస్తుంటారు. గ్రామీణ నేపధ్యం, తెలుగు మీడియం చదువు వల్ల ఇతర భాషలు మాట్లాడడంలో ఇబ్బంది పడే చంద్రబాబు ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. దక్షిణ కొరియా పర్యటనలో వున్న అక్కడి వాణిజ్యవేత్తలను ఆకట్టుకోడానికి కొరియన్ భాషలో వారిని పలకరించే ప్రయత్నం చేశారు. ఈసారి కొరియా వచ్చే నాటికి ఇంతకన్నా కొరియన్ భాష బాగా మాట్లాడతానని కూడా వారికి బాబు ప్రామిస్ చేశారు. సౌత్ కొరియా పర్యటనలో రెండో రోజు బాబు టూర్ హై లైట్స్ ఇవే.

 • దక్షిణకొరియాలో రెండోరోజు ఉదయం ఏడున్నరకే ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు ప్రారంభం.
 • దక్షిణకొరియా పారిశ్రామిక నగరం బూసన్ సందర్శనకు సియోల్ నుంచి స్పీడు ట్రైనులో బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి బృందం.
 • బూసన్ సిటీలో ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రోడ్ షో/బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
 • బిజినెస్ సెమినార్‌లో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబును సాదరంగా ఆహ్వానిస్తూ కౌన్సిల్ జనరల్ జియోంగ్ డియోక్ మిన్ ప్రసంగం.
 • ముఖ్యమంత్రి చంద్రబాబును ‘డైనమిక్ లీడర్’గా అభివర్ణిస్తూ బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ ప్రసంగం.
 • రెండు ప్రాంతాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి వంటి అనేక అంశాలలో పరస్పర సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది : కిమ్ యంగ్‌వాన్
 • బూసన్, ఏపీ మధ్య పరస్పర అనుబంధం ఉపయుక్తంగా ఉండేలా ప్రయత్నిద్దాం :
 • కిమ్ సీయం చంద్రబాబు దక్షిణకొరియాలోని క్రియాశీల నగరం బూసన్ సందర్శించడం సంతోషం :
 • భారత రాయబారి దొరైస్వామి
  క్రియాశీలత, సాంకేతికత, బాహ్య ప్రపంచంతో సంబంధాలు, ఓడరేవుల అభివృద్ధి తదితర అంశాలలో బూసన్ సిటీకి, ఏపీకి పోలికలు ఉన్నాయన్న దొరైస్వామి.
 • భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని కొరియన్ పారిశ్రామికవేత్తలకు స్పష్టంచేసిన దొరైస్వామి.
 • ‘కియా’కు ఇచ్చిన ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేయడానికి కనీసం ఏడాదైనా పడుతుందని భావిస్తే, చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం 3 నెలలలోనే ఆ పని పూర్తిచేయడం విశేషం : దొరైస్వామి.
 • ‘కియా మోటార్స్’కు కేటాయించిన అభివృద్ధి పనుల విశేషాలపై బిజినెస్ సెమినార్‌లో లఘుచిత్ర ప్రదర్శన.
 • బిజినెస్ సెమినార్‌కు హాజరైన వారిని కొరియన్ భాషలో ‘ఆన్ యోంగ్ హో సే’ (Aan Yong ho sei) అంటూ పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
 • మళ్లీ కొరియా వచ్చేప్పుడు కొరియన్ భాషలో ఇంతకంటే మెరుగ్గా మాట్లాడుతానన్న సీయం.
 • కొరియన్ భాషలో తర్జుమా చేసిన ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్‌ను బిజినెస్ సెమినార్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలకు అందజేయడం విశేషం.
 • కొరియన్ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి వారి భాషలోనే ఏపీ గురించిన సానుకూల అంశాలను వివరించడం ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నం