దిల్‌రాజుకు తొలిప్రేమ అంటే ఇంత ఇష్టమా?

Dil Raju acquired the Total Distribution Rights of varun tej Tholi Prema

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరుణ్‌ తేజ్‌ హీరోగా వెంకీ అట్లూరిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేయడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఒక విభిన్న కథతో వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కింబోతున్నాడు. దిల్‌రాజుకు మొదట నుండి ఈ కథపై ఆసక్తి ఉందట. తానే నిర్మించాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు వెళ్లింది. తాజాగా చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ ఖరారు చేయడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకే ఈ చిత్రం మొత్తం పంపిణీ హక్కులను దిల్‌రాజు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

tholi-prema

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం పంపిణీ హక్కులను దిల్‌రాజు దక్కించుకున్నాడు. భారీ మొత్తంను నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు చెల్లించి ఈ చిత్రాన్ని దక్కించుకున్నాడు అంటూ సమాచారం అందుతుంది. ‘తొలిప్రేమ’ చిత్రాన్ని హోల్‌సేల్‌గా దిల్‌రాజు దక్కించుకోవడంతో ఏరియాల వారిగా పంపిణీ హక్కుల కోసం మరింత పోటీ నెలకొంది.

producer-dil-raju

దిల్‌రాజు నైజాం రైట్స్‌ను తన వద్ద ఉంచుకుని మిగిలి అన్ని ఏరియాలను అమ్మేసే యోచనలో ఉన్నాడు. అయితే సినిమా విడుదల సమయంలో ఏరియాల వారిగా బిజినెస్‌ను చేయబోతున్నాడు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దిల్‌రాజు హ్యాండ్‌ ‘తొలిప్రేమ’పై పడటంతో ఒక్కసారిగా వరుణ్‌ మూవీ క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది.