కాలేజ్ అంటే చదువొక్కటే కాదు, మరెన్నో !

Narayana students awareness campaign on road safety

కాలేజ్ అంటే చదువొక్కటే కాదు, మరెన్నో ఉంటాయి. చదువొక్కటే నేర్చుకోడానికి అయితే కాలేజీ దాకా వెళ్లక్కరలేదు. అలా వెళ్లి చదివే చదువుకు అర్ధం కూడా ఉండదు. కాలేజ్ కి వెళితే నాలుగు విషయాలు తెలుస్తాయి,లేని వారికీ సేవ చేయడం, చదువుకున్న మూర్ఖులకి అవగాహన వచ్చేలా చేయడం లాంటివి చేయచ్చు. కానీ నేటి కార్పోరేట్ యుగంలో పిల్లల్ని లోపలేసి రుద్దడమే తప్ప ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయించడం అంటే జరగని పని. కానీ విద్యార్ధుల మనోవికాసమే లక్ష్యంగా వారిని ముందుకు తీసుకువెళుతూన్న నారాయణ సంస్థ మాత్రం వారిని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంచుతుంది.

road-safety

తాజాగా రోడ్డు మీద డ్రైవింగ్ చేసేవారు సురక్షితంగా ఇంటికి చేరేలా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలను నారాయణ విద్యార్థులు మూడు రోజులుగా విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌, బయోడైవర్సిటీ సిగల్స్‌, ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ జంక్షన్‌ వంటి రద్దీ కూడళ్లలో మాదాపూర్‌ నారాయణ జూనియర్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులు తెల్లగులాబీలతో పాటు చిన్న సందేశంతో కూడిన పత్రాలను ప్రయాణికులకు పంపిణీ చేశారు. అందులో హెల్మెట్‌, సీటుబెల్ట్‌ల ఆవశ్యకతను వాహన చోదకులకు వివరించారు. అనునిత్యం విద్యార్ధులని చదువు చదువు అని వెంటపడే విద్యాసంస్థలు కూడా నారాయణ బాటలోనే నడిస్తే ఆ ఈడు చదువుకునే పిల్లలకి ఒత్తిడి అనేది మాయం అవడం పెద్ద విషయమేమీ కాదు.

road-safety